బిగ్ బాస్ మొదలవుతుందంటే చాలు అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు కంటెస్టెంటుల్లోనూ హడావుడి అంతా ఇంతా కాదు. ఎక్కడున్నా బిగ్ బాస్ వస్తుందంటే చాలు జనాలు టీవీల ముందు తిస్ట వేయాల్సిందే. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన కంటెంస్టెన్స్ సంగతి చెప్పనవసరం లేదు. అందులో వాళ్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్కో సారి వాటిని చూసి జనాలకు మతి కూడా పోతుందంటే అతిశయోక్తి కాదేమో. దీనికి నిదర్శనం బిగ్ బాస్ షో లో జరిగే వాటిని బ్రేకింగ్ న్యూస్ గా ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాము. అయితే అందులో జరిగే గాసిప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఒకరి ముందు ఒకలా, మరొకరి ముందు మరొకలా మాట్లాడుకోవడం చూస్తూనే ఉన్నాము. దాని వల్ల వారి మధ్యన జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ గొడవలకు సంబంధించి బయటకు వచ్చిన తర్వాత వారు వెల్లడించే విషయాల గురించి తెలిసిందే. కేవలం గేమ్ లో భాగంగా ఇలాంటివి జరుగుతుండడం కామన్ అని వాళ్లే చెబుతుంటారు. బయట అలాంటివి పట్టించుకుంటామా అని వాఖ్యానిస్తుంటారు.
అయితే ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు ఒకలా బయటకు వచ్చాకా మరొకలా మాట్లడడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే బిగ్ బాస్ 4 లో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. అలా అయిన ప్రతి ఒక్కరూ షో నుంచి వచ్చాకా దాని గురించి ఏదో ఒక సంచలన వాఖ్యలు చేసి న్యూస్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అయితే కంటెస్టెంట్ల ఎలిమినేషన్ మాత్రం ప్రేక్షకుల చేతిలోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే కంటెస్టెంట్ల ప్రతిభ బాగలేకపోవడమో, లేక వారి ప్రవర్తన నచ్చకనో వారు ఎలిమినేట్ అవుతూనే ఉన్నారు.
అయితే ఐదో వారంలో జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. సుజాత ఎలిమినేట్ కావడానికి ముఖ్యంగా కొన్ని విషయాలని చెప్పొచ్చు. అతిగా నవ్వడం. ఆ నవ్వడంలోనూ నిజాయితీ లేకపోవడం, అందరి గురించి గాసిప్స్ బాగా చెప్పడం మూలంగానే ఎలిమినేట్ అయిందని చెప్పుకోవచ్చు. దీనితో పాటు ముఖ్యంగా హీరో నాగార్జునను బిట్టు అని పిలవడం మూలంగా ఆయన అభిమానులు ఎలిమినేట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి జోర్దార్ సుజాత కొన్ని నిజాలను బయటపెట్టింది.
నాగార్జున గారిని బిట్టూ అని పిలవడం తనకి ఇష్టమేనని అలా పిలవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసాకే పిలిచానని సుజాత తెలిపింది. అలాగే ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేముందు మీకు ఇష్టం అయితే పిలవండని తెలిపారని ఆమె వివరణ ఇచ్చింది. దీనితో పాటు ఇలా పిలిచనందుకు నాగార్జున ఫ్యాన్స్ హర్ట్ అయిన వారికి ఆమె క్షమాపణలు కూడా చెప్పారు. మొత్తంగా ఆమె బిట్టు అని పిలవడం తన ఇష్ట ప్రకారమే పిలవలేదని ఆమె వివరణ ఇచ్చింది. ఏదైనా బిగ్ బాస్ ఇష్ట ప్రకారమే జరుగుతుందని జోర్దార్ సుజాత తెలిపింది.