గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ ఫైవ్ లో సిరి నిలిచింది. అంతకుముందు యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు చేసిన సిరి.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ ఇమేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన సిరి.. తనదైన శైలిలో రాణించింది. ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా సిరి.. మంచి మార్కులే కొట్టేసింది. కానీ షణ్ముఖ్ జస్వంత్ తో మరి క్లోజ్ గా ఉండటం ఆమెకు పెద్ద మైనస్.. మాత్రమే కాదు హౌస్ నుండి బయటకు వచ్చాక చాలా నెగటివిటి ఎదుర్కోవడం జరిగింది.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక.. షణ్ముక్ కి దీప్తి సునయన బ్రేకప్ చెప్పడం..తో వారిద్దరు విడిపోవడానికి సిరి అన్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో షణ్మక్ ఇంస్టాగ్రామ్ లో సిరి నీ అన్ ఫాలో చేయటం మరోపక్క సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో సిరి ఫోటోలను వీడియోలను.. డిలీట్ చేయడం జరిగింది. ఈ పరిణామంతో సిరి లవ్ కూడా ట్రాక్ తప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ బాగా అర్థం చేసుకోవడంతో.. చాలావరకు లైఫ్ ని ఎదుర్కొంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ.. కెరియర్ పరంగా సిరి సత్తా చాటుతోంది. “ఆహా” ఓటిటిలో పలు కార్యక్రమాలు చేస్తూ మరోపక్క సినిమా అవకాశాలు అందుకుంటున్న సిరి.. తాజాగా కొత్త కారు కొనడం జరిగింది. బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలసి కొత్త కారు కొని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.