Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ సన్నీ టైం నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో రాకముందు టెలివిజన్ రంగంలో… సీరియల్స్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సన్నీ…బిగ్ బాస్ షోలో… ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండటం మాత్రమే కాక… ఫిజికల్ టాస్క్ లో… తిరుగులేని కంటెస్టెంట్ గా రాణించాడు. ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి చివరాకరికి .. లేడీ గెటప్ వేయడానికి కూడా వెనకాడకుండా… సన్నీ రెచ్చిపోయాడు. టైటిల్ గెలిచాక బయటికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తూ రాణిస్తున్న సన్నీ… సకల గులాబీ రామ సినిమా చేయటం తెలిసిందే. సన్నీ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ వేడుక హైదరాబాద్ లో ఇటీవల జరిగింది.
ఈ వేడుకకు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు వచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో సన్నీ చేసిన కొన్ని కామెంట్లపై నెటిజన్లు … మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా అఖిల్… సన్నీకి ఇండైరెక్ట్ కామెంట్ లో చేశారు. ఇంతకీ సన్నీ చేసిన కామెంట్స్ చూస్తే. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో… సోహెల్ క్యాష్ తీసుకోవడం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి సన్నీ మాట్లాడుతూ…’నాల్గో సీజన్లో సోహైల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేశిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు.
అయినా సరే టెంప్ట్ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా’ అని కొంచెం అతిగా మాట్లాడాడు. దీంతో సన్నీ గెలిచాక కొద్ది దూరం పెరిగిందన్న కామెంట్లు బయటనుండి వినబడుతున్నాయి. ఈ క్రమంలో సీజన్ ఫోర్ లో అఖిల్ కి జిగిరి ఫ్రెండ్ అయినా… సొహైల్ నీ విమర్శించడం పట్ల అఖిల్ పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు. సన్నీ పేరు చెప్పకుండానే ఘాటుగా ఇంస్టాగ్రామ్ లో రియాక్ట్ అయ్యాడు. ‘ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు. మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అప్పుడు నేనక్కడ ఉంటే బాగుండేది!’ అని.. మండిపడ్డాడు. ఏది ఏమైనా సన్నీ గెలిచాక కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నాడు అన్న టాక్ బయట గట్టిగా వస్తుంది.