Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మానస్ టాప్ ఫోర్ లో నిలిచాడు. టైటిల్ విన్నర్ సన్నీ అదే విధంగా కాజల్ తో మంచి ఫ్రెండ్ షిప్ బాండింగ్ క్రియేట్ చేసుకున్నాడు. మానస్ చాలా తెలివిగా గేమ్ ఆడుతూ… చివరి వారం దాకా రావడం జరిగింది. ఫిజికల్ టాస్క్ పరంగా… ఇంక మైండ్ గేమ్ పరంగా మానస్… తనదైన శైలిలో ఇచ్చి పడేసాడు. ట్రాన్స్ జెండర్ పింకీ కూడా మానస్ కి బాగా కనెక్ట్ కావడం సీజన్ ఫైవ్ లో హైలెట్ గా నిలిచింది.
అంతకంటే హైలెట్ మానస్ వాళ్ల అమ్మగారు హౌస్ లోకి వచ్చి… అందరినీ జోష్లో నింపటం.. డాన్స్ చేయడం.. ఫ్యామిలీ ఎపిసోడ్ కి హైలెట్ అయ్యింది. ఇదిలా ఉంటే బిగ్బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ ప్రకటించిన తర్వాత…మానస్ టెలివిజన్లో పలు ప్రముఖ షోలలో పాటిస్పేట్ చేయడం జరిగింది. వీటికంటే ముందు టైటిల్ విన్నర్ సన్నీతో చాలా టీవీ చానల్స్ లో ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ చేస్తున్నట్లు మానస్ తెలియజేయడం జరిగింది. ‘చి.ల.సౌ. రాంబాబు’ అనే వెబ్ సీరిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
రొమాంటిక్ కామెడీ జనర్ కు చెందిన ‘చి. ల. సౌ. రాంబాబు’ వెబ్ సీరిస్ ను పిఆర్ఎన్ బాబు దర్శకత్వంలో రమేశ్ చంద్ర సమర్పణలో రవి బండా నిర్మిస్తున్నారు. శశిప్రీతమ్ దీనికి సంగీతాన్ని అందిస్తుండగా రాజీవ్ వల్లభనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. దీనికి శివ గోపాల్ రెడ్డి క్రియేటివ్ హెడ్. శివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఈ నెల పదో తారీకు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. చాలా సరదాగా సాగిపోయే రొమాంటిక్ కామెడీ స్టోరీ అని… ఇలాంటి సబ్జెక్ట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నట్లు మానస్ తెలియజేయడం జరిగింది.