25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Ott Telugu: ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో.. క్లైమాక్స్ లో భారీగా ఓట్లు రాబడుతున్న కంటెస్టెంట్..!!

Share

Bigg Boss Ott Telugu: ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ షోలో మగవాళ్లే విజేతలుగా నిలిచారు. చాలామంది ఆడవాళ్ళు పోటీ పడినా గాని రన్నరప్ దాక రావటం మాత్రమే జరిగింది. కానీ ఈసారి ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో..లో లేడీ కంటెస్టెంట్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు బిందు మాధవి. ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా గేమ్ పరంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి మంచి పోటీ ఇస్తున్న బిందుమాధవి యాంకర్ నాగార్జున అభిమానం కూడా సంపాదించడం జరిగింది. దీంతో తాజా పరిణామాలను బట్టి చూస్తే బిందుమాధవి గ్యారెంటీగా విన్నర్ అని అందరికీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఓ కంటెస్టెంట్ ఓటింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. bigg boss ott voting for anchor shiva goes up

ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు యాంకర్ శివ. ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో..లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శివ.. అంతకుముందు యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. కొంతమందితో తీసుకున్న ఇంటర్వ్యూలు.. యాంకర్ శివ కి మంచి గుర్తింపు దర్శించాయి. అయితే గేమ్ పరంగా ప్రారంభంలో నెగిటివిటీ ఎదుర్కొన్న శివ.. గేమ్ క్లైమాక్స్కి చేరుకున్న సరికి.. మనోడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రారంభంలో బద్ధకంగా కొద్దిగా మొండిగా గేమ్ ఆడిన గాని… షో చివరికి వచ్చేసరికి యాంకర్ శివ ఆట తీరు మొత్తం మారిపోయింది.

అందరిని ఆకట్టుకునే రీతిలో మాట్లాడటంతో పాటు గేమ్ ఆడటం చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉండటంతో ఊహించని విధంగా యాంకర్ శివ ఓటింగ్ చివరిలో ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో.. టైటిల్ గెలిచే రేస్ లో శివ పేరు ఇప్పుడు గట్టిగా వినపడుతోంది. దాదాపు బిందుమాధవి కి పోటీగా యాంకర్ శివ కి ఓట్లు పడుతున్నాయి. మరి యాంకర్ శివ టైటిల్ గెలుస్తాడో లేదో చూడాలి.


Share

Related posts

పెళ్లి చేసుకొని ఏం పీకాలంటున్న వి.వి.వినాయక్!

Teja

బిగ్ బాస్ 4 : ఆ కంటెస్టెంట్ పై బిగ్ బాస్ పక్షపాతం..? మరి అతనికే మినహాయింపులు ఎందుకు?

arun kanna

Dandruff: చుండ్రు, తలలో పేలు పోవడానికి వేపాకుతో ఇలా చేసి చూడండి..,!!

bharani jella