Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని.. రోజుకి రెండు సార్లు స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు. 17 మంది సభ్యులు ఎంట్రీ ఎలా ఇద్దరు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 15 మంది గేమ్ బరిలో ఉన్నారు. వీరిలో ఒకరు రేపు ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఎలిమినేషన్… నామినేషన్ కి సంబంధించి 12 మంది సభ్యులు… నామినేట్ కావడం తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో కొత్త ఎంట్రీ షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ నీ హౌస్ లోకి పంపించాలి అని ఆలోచన చేస్తున్నారట. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ సీజన్ ఫైవ్ కి సంబంధించిన సెలబ్రిటీ అని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి సంబంధించి… కొంత మంది సభ్యులతో షో నిర్వాహకులు మంతనాలు జరిపినట్లు.. ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం విశ్వ ఓటిటి బిగ్ బాస్ షోలో కి రాబోతున్నాడు అని బయట ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే గత సీజన్ లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదు. దీంతో బిగ్ బాస్ ఆడియన్స్ చాలా నిరుత్సాహం చెందారు. గత బిగ్ బాస్ సీజన్ లో 19 మంది ఎంట్రీ ఇవ్వగా .. ఒక వైల్డ్ కార్డు ఎంట్రీకి కూడా ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ పరిణామంతో చాలా మైనస్ సీజన్ ఫైవ్ ఎదుర్కోవటం జరిగింది. కనుక తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో…లో అటువంటి ఈ పరిస్థితి రాకూడదని ఎక్కువ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉన్నట్లు… షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం.