Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ సన్నీ బయట మంచి జోష్ మీద ఉన్నాడు. దాదాపు టైటిల్ ప్రకటించి మూడు వారాలు కావస్తున్న.. ఎక్కడా కూడా సన్నీ వచ్చిన క్రేజ్ చేజారిపోకుండా తెలివిగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఒక పక్క వరుసపెట్టి సోషల్ మీడియాలో.. ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూనే… మరో పక్క ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు అందుకనే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సన్నీ, మానస్, కాజల్ ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ముగ్గురు హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ… చివరి వారం కి ముందు..వారం దాకా కలిసి రానించి సరిగ్గా టాప్ ఫైవ్ కి వెళ్లకముందు కాజల్.. ఎలిమినేట్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే సన్నీ దాదాపు మూడు నాలుగు వారాలపాటు పెద్దగా.. జనాలలో అంత క్రేజ్ గుర్తింపు.. దక్కని పరిస్థితి ఉంది. కానీ ఒకే ఒక్క సంఘటన.. సన్నీ గ్రాఫ్ అమాంతం పెంచడం జరిగిందని.. ఆ తర్వాత సన్నీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ టాస్క్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ వచ్చినట్లు సన్నీ ఆట గురించి.. సరికొత్త వార్త బయటపడింది.
విషయంలోకి వెళితే.. ప్రియ ఆంటీ(Priya Aunty).. గుడ్లు టాస్క్.. చెంప పగల కొడతా..అంటూ.. సన్నీ(Sunny)ని కెప్టెన్ కాకుండా చేయాలని ఏడో వారం లో.. రెచ్చగొట్టే గేమ్ ఆడింది. సన్నీకి చాలా కోపం వచ్చినా గానీ.. ఈ క్రమంలో ఎక్కడ టెంపర్ రిలీజ్ కాకుండా ఆడిన గేమ్.. ఆ తర్వాత ప్రియ ఆంటీ ఎలిమినేట్ కావటం మొత్తం సినారియలో.. అప్పటి నుండి వెనక్కి తిరిగి పోకుండా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా సన్నీ పెర్ఫార్మెన్స్ చేసి టైటిల్ గెలవడం జరిగింది. ప్రియ ఆంటీ రెచ్చగొట్టిన ఎపిసోడ్ యే… సన్నీకి ప్లస్ అయిందని సన్నీ ఆట గురించి తాజాగా ఈ విశ్లేషణ సోషల్ మీడియాలో.. వైరల్ అవుతుంది.