ట్రెండింగ్

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్పెషాలిటీ ఇదే..!!

Share

Bigg Boss: బిగ్ బాస్(Bigg Boss) షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ షోకి తిరుగులేని క్రేజ్ ఉంది. ఇండియా(India)లో కూడా చాలా భాషలలో షో రన్ అవుతోంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. మొన్ననే డిసెంబర్ 19 వ తారీకు సీజన్ ఫైవ్ ట్రోఫీ సన్నీ(Sunny) గెలవడం అందరికీ తెలిసిందే.

Nagarjuna hikes his remuneration for Bigg Boss 5 Telugu?

ఇదిలా ఉంటే ఐదో సీజన్ పూర్తయ్యి వారం రోజులు గడవక ముందే ఆరో సీజన్.. మరో రెండు నెలలో స్టార్ట్ కానున్నట్లు బిగ్ బాస్(Bigg Boss) షో నిర్వాహకులు తెలియజేయడం సంచలనంగా మారింది. సాధారణంగా ఒక బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ముగిశాక తొమ్మిది నెలలు గ్యాప్ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం 50 రోజుల వ్యవధిలోనే.. ఆరో సీజన్ ప్రారంభించాలని షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. ఇందుకు గాను ఇప్పటికే సీజన్ సిక్స్ కి సంబంధించి.. కంటెస్టెంట్ ల వేట మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఉంటే ఈ ఆరో సీజన్ చాలా భిన్నమని సో నిర్వాహకులు తాజాగా తెలియజేశారు.

Bigg Boss 6th Announcement press meet డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ లైవ్..

విషయంలోకి వెళితే వాస్తవానికి బిగ్ బాస్(Bigg Boss) 24 గంటలు ఉండగా మొత్తం వడపోసి.. కేవలం గంట మాత్రమే రోజు చూపిస్తూ ఉంటారు. కానీ ఆరో సీజన్ మాత్రం 24 గంటలు 7 రోజులు చూపించడానికి షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. ఇక ఇదే తరుణంలో ఓటిటి లో… ఆరో సీజన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. వచ్చే మార్చి ప్రారంభంలో సీజన్ సిక్స్ అంగరంగ వైభవంగా ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా సీజన్ ఆరు కేవలం యాభై రోజులు మాత్రమే ఉంటుందని టాక్. మాములుగా అయితే గత బిగ్ బాస్(Bigg Boss) సీజన్ లు వంద రోజులకి పైగా ఉండటం మనం చూశాం. కానీ ఆరో సీజన్ ఇరవై నాలుగు గంటలు ప్రసారం కానున్న క్రమంలో 50 రోజులు చాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. 


Share

Related posts

Free Petrol & Diesel: ఉచితంగా 50 లీటర్ల డీజిల్, పెట్రోల్ పొందండిలా..!!

bharani jella

Birthday: మన భారతీయ సంప్రదాయం పుట్టినరోజు నాడు ఏఏ పనులు చేయకూడాని చెప్పిందో తెలుసా? 

Naina

బిగ్ బాస్ 4 : గ్రాండ్ ఫినాలే కి పోటెత్తిన సెలబ్రెటీలు…

arun kanna