Bigg Boss 6 Telugu: తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో కి.. విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళం, కన్నడం వంటి భాషలలో.. ఇప్పటికే ఈ షో అనేక సీజన్ లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తెలుగులో ఐదు సీజన్ లు పూర్తిచేసుకున్న ఈ షో.. మరి కొద్ది నెలల్లో ఆరో సీజన్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఆరో సీజన్ కి సంబంధించి లోగో లాంచ్.. నాగార్జున హోస్టింగ్ వ్యవహారం కన్ఫామ్ అయ్యింది. రెండు వీడియోలు కూడా ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు.. కంటెస్టెంట్ లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ షో లోకి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మొదటిగా యూట్యూబర్ హర్ష కి అవకాశం కల్పించడం జరిగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు హర్ష సోలో పాల్గొంటున్నట్లు వీడియో కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఇంకా సీజన్ సిక్స్ లోకి… వస్తున్న కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
ఆ లిస్ట్ చూస్తే..జబర్ధస్త్ వర్ష, కొరియోగ్రాఫర్ పొప్పీ మాస్టర్ యాంకర్ రోషన్, వలయం సినిమా ఫేమ్ హీరో లక్ష్య చదలవాడ, బుల్లితెర నటి కరుణ భూషణ్, బుల్లితెర నటుడు కౌశిక్, యూట్యూబర్ శ్రీహాన్, మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ చైతన్య గరికపాటిలు, ప్రముఖ యాంకర్ మంజుషా, హీరోయిన్ ఆశా సైనీ, న్యూలి మేరీడ్ సినిమా ఫేమ్ సంజన చౌదరి, యూట్యూబర్ కుషిత కల్లపు, సింగర్ మోహన భోగరాజు. వీళ్లంతా.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి రావడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.