టీవీల్లో బిగ్ బాస్ ప్రసారమవుతుందంటే చాలు ప్రేక్షకులు ఎక్కడున్నా టీవీ ముందు తిష్ట వేయాల్సిందే.. అందులో కంటెస్టుల మధ్య జరిగి రసవత్తర మాటల యుద్దాలను వీక్షిస్తూ కూర్చుంటారు. అలా కాదు ఇలా జరగాల్సిందేమోనని తెగ చింతించేస్తుంటారు కొందరు ప్రేక్షకులు. కాని బిగ్ బాస్ 1 నుంచి ప్రజలకున్న ఇంట్రెస్ట్ ను బిగ్ బాస్ 4 సంపాధించుకోలేక పోతోంది. ఈ బిగ్ బాస్ కు చాలా మంది ఫ్యామిలీ ఆడియెన్స్ చూడటమే మానేశారని చెప్పుకోవచ్చు.
మరీ ముఖ్యంగా ఏ సీజన్ కు రానన్ని విమర్శలు ఈ సీజన్ వస్తున్నాయి. ఇప్పటికే సగం ఎపిసోడ్ పూర్తి చేసుకుంది ఈ బిగ్ బాస్ 4. ఈ షోకు హోస్ట్ గా మన్మధుడు నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ షోకు తెర దిగనుంది. దీంతో ఈ షోలో హౌస్ మేట్స్ మధ్య పోటీ తవ్రంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మీలో ఓ ఒక్కరికీ బిగ్ బాస్ లో ఎంట్రీకి చాన్స్ వస్తే ఏంచేస్తారు? ఎగిరి గంతేస్తారు కదూ.. అందులో గెలవకపోయినా.. ఒక్క సారైనా అలాంటి ఇల్లును చూడాలన్నా కోరికతోనైనా వెళ్లాలనుకుంటారు.
ఇంద్రభవనం లా తలతలా మెరిసిపోతూ ఉంటుంది. జిగేల్ జిగేల్ మనిపిస్తూ లైట్ల వెలుగులో కళ్లను మైమరపిస్తుంటుంది బిగ్ బాస్ 4 హౌస్.. చాలా సువిశాలంగా ఉంటూ చూపరులను ఆకట్టుకునేలా నిర్మించారు ఈ హౌస్ ను. మరి ఆ హౌస్ లోపలి నుండి టీవీల్లో చూడటమే గాని ఎప్పుడైనా బయట దాని రూపు రేఖలు ఎలా ఉన్నాయో చూశారా? అయ్యో చూడలేదు కదూ.. మరింకెందుకు ఆలస్యం అది కూడా చూసి ఆనందించంది.
ఇప్పటికే బిగ్ బాస్ 4 హౌస్ బయట ఎలా ఉందనే డ్రోన్ ద్వారా తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. యూట్యూబ్ లో సాయికాంత్ కృష్ణ చానెల్ లో ఈ వీడియో ను అప్ లోడ్ చేశారు. ఇంకేముంది ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెట్ ను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ సెట్, నాగార్జున హోస్ట్ గా చేసే స్టూడియో లు రెండూ పక్కపక్కనే ఉన్నట్టు ఈ వీడియోలో మనం చూడవచ్చు.