తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో ఇంటి సభ్యులు చేస్తున్న అల్లరి చేష్టలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే అప్పుడప్పుడు అవి కూడా కాస్త ఎక్కువ అయిపోతున్నాయి. తోటి సభ్యులను ఇబ్బంది గురిచేస్తున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో మిగతా కంటెస్టెంట్స్ జోర్దార్ సుజాతను ఆట పట్టించడం తో ఆమె బోరున విలపించింది.
ఇకపోతే అఖిల్-మోనాల్ మధ్య అలాగే అభిజిత్-మోనాల్ రొమాంటిక్ మూమెంట్స్ గురించి సభ్యులు కూడా కొరుక్కోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో సుజాతను దేత్తడి హారిక ఇంటరాగేషన్ చేసినంత పని చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఓ బాయ్‌ఫ్రెండ్ ను చూసుకోమని సలహా ఇచ్చింది. దానికి సుజాత పైకి కోపం చూపించకపోయినా తన హావభావాలతో మాత్రం చిరాకు వ్యక్తం చేసింది. ఇప్పుడు హారికకు ఈ విషయంలోనే బయట బాగా నెగిటివిటీ వచ్చేసింది అని టాక్.
సుజాత తనకు ఇంట్లో అందరూ అన్న, తమ్ముడు లాంటి వాళ్లే అని స్పష్టం చేసింది అయితే సోహెల్ తో ఫ్రీ గా ఉంటున్నా అని చెబితే అతనినే సెలెక్ట్ చేసుకో అంటూ సలహా ఇచ్చింది హారిక. కానీ సుజాత మాత్రం ఎంతో మర్యాదగా తనకు అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది. అయితే హారిక అంతకు మించి ఓవర్ యాక్షన్ చేస్తూ ఇలా రకరకాలుగా ఆమెను ఏదో ఒక అఫైర్ లో బుక్ చేద్దామని కనిపించింది. అలాగే మిగతా వారు కూడా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు.
దీంతో అక్కడి నుండి సుజాత వెళ్దామని చూస్తే అందరూ కలిసి ఆమెను పట్టుకున్నారు. హారిక ఈ సీన్ లో మాత్రం చాలా ఎక్కువ చేసింది అని బయట చెప్పుకుంటున్నారు. అయితే తనకి అలాంటి ఆలోచన లేదని సుజాత ఖరాఖండిగా చెప్పేసింది కానీ హారిక మాత్రం ఎలాగైనా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో లేదంటే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళవు అని అనేసింది. మీ అమ్మ నాన్న లను అని కూడా చూడకుండా అయిపోతావ్ అని బెదిరించింది.