ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఇంట్లో 100% వినోదాన్ని పంచే కంటెస్టెంట్ ఎవరు అంటే జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్. ఇతను ప్యూర్ ఎంటర్టైనర్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తాడు. నామినేషన్ విషయంలో ఒకరిద్దరు అవినాష్ ఈ విషయంలో అతనిని నిందించినా కూడా ప్రేక్షకులు అందరూ ఇప్పుడు అతని కామెడీ టైమింగ్ కి ఫిదా అయిపోయారు.
ఆలస్యంగా వైల్డ్ కార్డ్ గా ఇంట్లోకి వచ్చినా కూడా అందరితో బాగా కలిసిపోయాడు. ఈ నాలుగో సీజన్ లో మొదటిసారిగా ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఇక ఇలాంటి సమయంలో అవినాష్ కి అరియానా కు నాగార్జున లింక్ పెట్టేశాడు. దానికి తగ్గట్టే ఇద్దరూ బిబి హోటల్ టాస్క్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు.
అయితే ఆ తర్వాత టాస్క్ లో అవినాష్ తాను ఎలా ఆడాను అంటూ అరియానా nu అడిగాడు ఆమె సమాధానం వినకుండానే ఇతనే నేను బాగా ఆడేశాను అంటూ తనను తానే పొగుడుతున్నాడు. దానికి ఆమె ఛీ కొట్టింది. ఇక ఈ వయసులో కూడా బాగా ఆడుతున్నావు అంటూ అమ్మ రాజశేఖర్ ను అవినాష్ కామెడీ గా పొగిడాడు.
అవినాష్ కు అనంతరం దివి ఐలవ్యూ చెప్పింది. అయితే అది బిగ్ బాస్ రూపంలో ఉన్న అవినాష్ కు అయినప్పటికీ అతను తనకు చెప్పిందని ఫీల్ అయ్యాడు. ఆ వెంటనే హారిక ముద్దు పెట్టేటప్పటికి ఆ ఆనందం అంతా ఆవిరి అయిపోయినట్లు నిట్టూర్చాడు. మొత్తానికి అవినాష్ ఈరోజుటి ఎపిసోడ్ లో ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.