బిగ్ బాస్ 4 : హౌస్ లో దెయ్యంగా 1st సీజన్ కంటెస్టెంట్ హరితేజ ట్రెండింగ్

బిగ్బాస్ ఇంటిలో మొదటి సీజన్ ఫైనలిస్ట్ అయినా హరితేజ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. హౌస్ లో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక హరితేజ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. ఆమెకు వరుసబెట్టి సినిమా ఆఫర్లు రావడం మొదలెట్టాయి. బిగ్ బాస్ ద్వారా ఆమెకు చాలా మంచి క్రేజ్ వచ్చింది.

 

అలాంతి హరితేజ సోషల్ మీడియాలో పూర్తి యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెడుతూ వారంతా అడిగే ప్రశ్నలకు చాకచక్యంగా సమాధానాలు చెబుతూ చలాకీగా ఉంటుంది. ఇక బిగ్ బాస్ నాలుగవ సీజన్ కి సంబంధించి ఈరోజు విడుదల చేసిన ప్రోమో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇంటిలో ఉన్న దెయ్యాలు అందరినీ ఒక ఆట ఆడిస్తున్న ట్లు చూపించారు. అవినాష్ మాత్రం దెయ్యాల తో ఆటలాడుతున్నాడు అని అంటున్నారు. అయితే బిగ్ బాస్ షో లో కనిపించే దెయ్యం హరితేజ అంటూ కొంతమంది మీమ్స్ క్రియేట్ చేశారు.

అలాంటిది ఒకటి హరితేజ కంటపడింది. వారంతా సరదాగా హరితేజ నే దెయ్యంలా మరి ఈ సీజన్ లో కి వచ్చి అందరినీ భయపెడుతోంది అని అన్నారు. దానికి హరితేజ నేను మీకు అలా కనిపిస్తున్నా…?నా అంటూ కామెంట్ చేసింది, ఇక విపరీతంగా మీన్స్ వస్తుంటే…. దానిపై క్లారిటీ ఇచ్చేందుకు హరితేజ లైవ్ కి వచ్చింది. ట్రోలింగ్ కాస్త ఎక్కువ కావడంతో ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. మీరే నా గెస్ట్ పాత్రలో అలా వచ్చి అందరిని భయపెడుతున్నారు అని హరితేజ కు ఎన్ని మెసేజ్లు రావడంతో ఆమె క్లారిటీ ఇచ్చింది.

“పోనీలే సరదాగా అంటున్నారు అని వదిలేస్తే…. మళ్లీమళ్లీ అంటున్నారు. ఆ దెయ్యానినికి నాకు అసలు సంబంధం లేదు…. అది నేను కాదు ఇల్లే…. నో” అంటూ పలు రకాల భాషలలో ఖండించింది హరితేజ. మొత్తానికి ఒక్కసారిగా బిగ్ బాస్ లో హరితేజ ట్రెండింగ్ లో నిలిచింది.