బిగ్ బాస్ 4 : ఈ వారం నామినేషన్లలో ఐదుగురు…! ఆ ఇద్దరు సేఫ్

బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్ 13వ వారం నామినేషన్ ప్రక్రియ చాలా కీలకంగా మారడంతో ఇంటి సభ్యులు అందరూ నాగార్జున చెప్పినట్లు గేమ్ పైన తమ పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక గ్రాండ్ ఫినాలేలో చోటు పొందేందుకు ప్రతీ ఒక్కరూ తమ వ్యూహాలను రెడీ చేసుకున్నారు. నామినేషన్ సందర్భంగా ఎప్పటిలాగే ఒక రేంజ్ లో తమ వాదనలు వినిపించారు.

 

ఇంటి సభ్యులకు కలర్ బాటిల్స్ ఇచ్చి మెడలో వేసుకోవలసిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. తాము నామినేట్ చేయవలసిన ఇద్దరు కంటెస్టెంట్ల ముందు ఉన్న గాజు కూజాలో తాము ఎంచుకున్న కలర్ ను పోసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. ఇక ఇంటి సభ్యులు అంతా గత టాస్క్ ఆధారంగా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.

మళ్ళీ ఎప్పటిలాగే అవినాష్ అఖిల్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమో ద్వారా స్పష్టమయింది. ఇంట్లో నా కంటే బలహీనమైన కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు నేను ఎందుకు నుండి ఎలిమినేట్ కావాలి అని అఖిల్ ను అవినాష్ అడిగాడు. ఇక నువ్వు…. నీకు నువ్వు టాప్ కంటెస్టెంట్ అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా అని అఖిల్ గట్టిగా సమాధానం ఇవ్వడంతో అవినాష్ కౌంటర్ వేసాడు.

నువ్వు నెంబర్ వన్ కంటెస్టెంట్ అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఇక ఇలా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తాజా సమాచారం ప్రకారం 13వ వారం లో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. అభిజిత్, హారిక, అఖిల్, అవినాష్, మోనాల్ నామినేట్ అయినట్లు తెలిసింది.