NewsOrbit
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : అభిజిత్ ఏంటి మోనాల్ ని అంత మాట అనేశాడు..? గుక్క పెట్టి ఏడ్చింది.. నిజంగా మోనాల్ డబుల్ గేమ్ ఆడుతుందా?

బిగ్బాస్ ఇంటిలో అయిదవ వారం నామినేషన్ ప్రక్రియ పెట్టిన మంట ఇంకా చల్లారలేదు. సుజాత ఎలిమినేట్ అయిపోయింది నాగార్జున చివాట్లు పెట్టాడు, ఒకరినొకరు విపరీతంగా పోట్లాడుకుంటున్నారు కానీ ఆ సెగ మాత్రం అందరినీ తాకుతూనే ఉంది. ముఖ్యంగా అభిజిత్, అఖిల్ ల మధ్య జరిగిన గొడవ సీజన్ హైలైట్స్ లో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ గొడవ వల్ల ఇంటిలో వారిద్దరూ ఒకరి మొఖం మరొకరు చూసుకో లేని విధంగా తయారయింది.

 

ఇక వీరిద్దరికీ నాగార్జున క్లాస్ పీకిన విషయం తెలిసిందే. అక్కడ మోనాల్ పై జాలి చూపించారు నాగార్జున. ఇద్దరిని ఒకేరకంగా మందలించాడు. ఈ క్రమంలో సోమవారం ఎపిసోడ్ లో అభిజిత్ మోనాల్ కి క్లాస్ తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే…. వారాంతంలో నాగార్జున ఈ విషయం మాట్లాడినప్పుడు అభిజిత్, అఖిల్ దగ్గర నుండి సమాధానాలు వచ్చినప్పటికీ సంతృప్తి చెందలేదు. ఒక అమ్మాయి నా పేరుని తీయకండి అని నెత్తి నోరు కొట్టుకుంటే మీరు వినిపించుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం సరికాదు అని అన్నారు.

నాగార్జున మోనాల్ తో మాట్లాడుతూ ఇద్దరిలో ఎవరిది తప్పు అని అడిగితే…. ఇద్దరిదీ తప్పు అని మోనాల్ చెప్పింది. ఇక మోనాల్ చెప్పిన విషయాన్ని ఆధారంగా చేసుకుని నాగార్జున వారికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆరో వారం మొదట్లో అభిజిత్ మోనాల్ కు ఇదే విషయమై గట్టిగా క్లాస్ పీకాడు. నేను నామినేషన్ అయిపోయిన తర్వాత నిన్ను బెడ్ రూమ్ లో కలిసి నీకు సంజాయిషీ ఇచ్చుకున్నారు సమయంలో అఖిల్ ది తప్పు అని నాతో చెప్పావు…. కానీ నాగార్జున గారి ముందు ఇద్దరిదీ తప్పు అని ఎలా అంటావు అని నిలదీశాడు.

తనని ఎక్కడ మోనాల్ వెధవని చేసినట్లు ఫీలయ్యాడు. అప్పుడు “ఒక అమ్మాయి విషయం” అని మోనాల్ ఏదో చెప్పబోతుంటే…. నువ్వు దీనిని ఒక “స్త్రీ సమస్య”గా నిలబెట్టకు అంటూ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నీ పైన అంత ప్రేమ ఉంటే నామినేషన్ ప్రక్రియ లో అతను నీ పేరు ఎందుకు ఎత్తాలి…? అని ప్రశ్నించాడు. నీకు నచ్చితే ఒక లాగా ఉంటావు నచ్చకపోతే మరొక లాగా ఉంటావు…. ఇద్దరినీ బ్యాలెన్స్ చేస్తావు అని గట్టిగా క్లాస్ పీకాడు.

దీంతో మోనాల్ అక్కడికక్కడే కన్నీటి పర్యంతమైంది. మొత్తానికి మొదటిసారి మొనాల్ ను ఆ ఇద్దరిలో ఒకరు బాగా నిలదీశారు అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆమె డబుల్ గేమ్ ఆడుతున్నట్లు.. కష్టం వస్తే ఏడ్చి తప్పించుకుంటున్నట్లు జనాలు అభిప్రాయపడుతున్నారు. అభిజిత్ తో ఒకటి…. నాగ్ ముందు ఒకటి చెప్పడం కరెక్టా కాది అని తెలియాలంటే ఈ రోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే.

author avatar
arun kanna

Related posts

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu

 Malli Nindu Jabili April 22 2024 Episode 628: నీ కోడల్ని హద్దుల్లో పెట్టుకోమంటున్న వసుంధర.మల్లి మంచితనం ముందు మనం సరిపోము అంటున్న కౌశల్య

siddhu