బిగ్ బాస్ 4 : బయటకి వెళ్ళిన లాస్య ఏంటి ఈ కంటెస్టెంట్ కి ప్రమోషన్స్ చేస్తోంది?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఇంటి నుండి 11వ వారం ఎలిమినేట్ అయిపోయిన బయటికి వచ్చిన పాపులర్ యాంకర్ లాస్య మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ తో ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. నామినేషన్ గురించి పలు విషయాలను వెల్లడించిన ఆమె అరియానా గురించి చాలా విషయాలు చెప్పింది. అరియానా చాలా బోల్డ్ అని…. ఆమె నిజాయితీ గా మాట్లాడుతుంది అని అనింది. చూసేందుకు నాజూగ్గా ఉన్నప్పటికీ తను మానసికంగా చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. వ్యక్తిగతంగా అయితే అరియానాకూ తనకు ఎప్పుడూ తగాదాలు లేవని ఇలా చెప్పుకొచ్చింది.

 

కానీ వారిద్దరి మధ్య ఇంటిలో అనేక సార్లు గొడవలు జరగడం చూశాం. కేవలం నామినేషన్ సందర్భంగా మా మధ్య అభిప్రాయ బేధాలు వస్తాయని అంతకుమించి ఏమీ లేదని తేల్చేసింది. ఇక ఒకసారి హిట్ మ్యాన్ టాస్క్ సందర్భంగా ఆమెకు అవసరం లేకపోయినా పరిగెత్తుకు వచ్చి నన్ను నామినేట్ చేసింది…. నన్ను ఎందుకు అంత టార్గెట్ చేసిందా అని నాకు అనిపించింది అని లాస్య చెప్పింది. అసలు అరియానా తనకు పోటీదారురాలు కాదని నామినేషన్ ఎంట్రీలో చెప్పిన మాటలను రాహుల్ గుర్తుచేశాడు.

అది ఏదో నామినేషన్ ప్రక్రియ దృష్టిలో ఉంచుకొని ఆ మాట అన్నాను అని లాస్య చెప్పింది. అఖిల్ సీక్రెట్ రూమ్ ను పంపించినప్పుడు…. అరియానాను ఉద్దేశించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అని తాను చెప్పానని లాస్య వివరణ ఇచ్చింది. మొత్తానికి ఇంట్లో అందరూ అరియానాతో ఫ్రెండ్లీగా ఉంటారని…. నామినేషన్లు, టాస్క్ ల విషయాలను పక్కన పెడితే అరియానా అందరితో అరియానా బాగుంటుందని లాస్య చెప్పింది. ఆమె గేమ్ రూల్స్ ప్రకారం ఆడేందుకు మానవత్వాన్ని కూడా పక్కన పెడుతుంది అని చెప్పిన లాస్య బిగ్బాస్ ఆదేశాలను ఆమె అతి జాగ్రత్తగా పాటిస్తుందని తెలిపింది. తనకు గేమ్ తప్ప మరొక ఆలోచన ఉండదు అని లాస్య చెప్పడం గమనార్హం.