బిగ్బాస్ నాలుగో సీజన్ లో 16వ రోజంతా టాస్క్ కొనసాగింది. పింక్ డ్రెస్ లో ఉన్న మనుష్యుల టీమ్…. వైట్ డ్రెస్ లో ఉన్న రోబోలు టాస్క్ లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నించారు. అయితే రోబో టీమ్ లోని అభిజిత్, అవినాష్, హారి,క లాస్య..ంఅనుష్యుల టీమ్ లోని దివి ని కిడ్నాప్ చేయడంతో వారు ఇష్టమొచ్చినంత ఛార్జింగ్ చేసుకున్నారు.
ఇక ఈ కిడ్నాప్ తో అఖిల్, సోహెల్, మెహబూబ్ తదితరులు బయట రచ్చరచ్చ చేశారు. 16వ రోజు అర్ధరాత్రి మొత్తం ఇంట్లో జరిగిన గొడవ చూపించడం జరిగింది. మెయిన్ హాల్లోకి వచ్చిన దివి ని గట్టిగా పట్టుకుని బంధించారు. దీవి ని అలా బంధించడం వెన్నుపోటు నిబంధనలను ఉల్లంఘించారని అఖిల్ రెచ్చిపోయాడు. అయితే రోబో లు చార్జ్ మాత్రం చేసుకోవడంలో సఫలమయ్యారు. మానవుల టీమ్, రోబో టీమ్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అయితే గేమ్ అలాగే గొడవల మధ్య కొనసాగించారు. ఈ దశలో మానవుడు టీం.. రోబో టీమ్ ను టీం బూతులు తిడుతూ విరుచుకుపడ్డారు. మోనాల్, అఖిల్, సొహెల్ మెహబూబ్ బూతులతో రెచ్చిపోయారు. ఇక రోబో టీం కు చెందిన గంగవ్వ ఇంటి సభ్యుల పై తన ప్రేమను కోపంతో చాటుకుంది. టాస్క్ లో ఎవరు కూడా భోజనం చేయకుండా ఉండడం పై సీరియస్ అయింది.
బువ్వ తినకుండా ఈ గొడవలు…. ఆటలు ఏంది అంటూ గంగవ్వ గరంగరం అయిపోయింది. అయితే టాస్క్ అంటే ఇలానే ఉంటుంది గొడవలు…. తిట్టుకోవడం కామన్ అని సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎపిసోడ్ సాగడంతో కొద్దిగా రసవత్తరంగా తయారయింది. గంగవ్వ కూడా రోబో టీమ్ వ్యూహంలో భాగమై మంచి చతురత కనబరచడం గమనార్హం.