మూడు నెలలకు పైగా రెండు రాష్ట్రాల్లోని బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన బిగ్బాస్ నాలుగవ సీజన్ కు నేటితో ఎండ్ కార్డ్ పడుతోంది. విన్నర్ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. రన్నర్ విషయంపై కూడా కొంచెం క్లారిటీ . అయితే ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ అయినా కౌశల్, మూడవ సీజన్ విరాహుల రాహుల్ మాత్రం మరొకచోట రచ్చ చేస్తున్నారు.
తాజాగా సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి సంబంధించి విడుదల చేసిన ప్రోమో లు బాగా క్లిక్ అయ్యాయి. యాంకర్ రవి కూడా ఆమెతో పాటు ఇందులో హోస్ట్ గా చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి వేసిన పంచ్ లు, సెటైర్ లు చాలా వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో సెలబ్రెటీలు గెస్ట్లుగా వస్తారు. మరోవైపు పార్టిసిపెంట్స్ ఉంటారు. సెలబ్రిటీలు పార్టిసిపెంట్స్ కు చాలెంజ్ ఇస్తుంటారు.
సాహసం చేయరా డింభకా, డ్యాన్సులు, టాస్క్ లు ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇక దీని షూటింగ్ స్టార్ట్ కాగా మొదటి గెస్ట్లుగా బిగ్బాస్ విజేతల వెళ్లారు. కౌశల్ ,రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటికే నెట్ లో రచ్చ చేస్తున్నారు వీటికి సంబంధించిన ఫోటోలు కౌశల్ తాజాగా షేర్ చేశాడు. బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫినాలే ఎపిసోడ్ రోజున రెండవ సీజన్ విన్నర్ మూడవ సీజన్ విన్నర్ కలిస్తే ఎలా ఉంటుంది అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఆ ఫోటోలలో జీతెలుగు హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తీరా చూస్తే ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి వచ్చేది జీ తెలుగు లో నే అని తెలిసి నోరెళ్ళబెట్టరు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!