తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ ప్రస్థానం ఇప్పటిది కాదు. మల్లెమాల వారు ఏ రోజున ఈ కామెడీ షో స్టార్ట్ చేసారో కానీ ఒక్కసారిగా ఈటీవీ దశ తిరిగిపోయింది. దాదాపు ఏళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతున్న ఈ షో ద్వారా ఎంతో మంది మంచి కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ షో కి ఒకే తరహాలో రెస్పాన్స్ రావడం గమనార్హం. ఇక అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులు ఎంతో మందికి ఇది మంచి ప్లాట్ఫాం గా నిలిచింది.
వారిలో ముక్కు అవినాష్ ఒకడు. చిన్న ఆర్టిస్ట్ గా వచ్చి పాపులర్ అయి టీం లీడర్ గా ఎదిగాడు. ఇప్పుడు తాజాగా బిగ్బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అవినాష్ చేసిన ఒక పని వల్ల ఒక మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్రమాదంలో పడ్డాడు. వివరాల్లోకి వెళితే జబర్దస్త్ వచ్చిన తొలినాళ్లలో అవినాష్ గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా శ్రమించాడు. అందులో భాగంగానే దాదాపు అందరి టీమ్ లలోనూ సభ్యుడిగా చేశాడు. ఈ క్రమంలోనే లేడీ గెటప్ లు కూడా వేశాడు. అప్పటి నుండి చాలా టీమ్స్ లో ప్రధాన సభ్యుడిగా మారిపోయాడు.
అద్భుతమైన టాలెంట్ తో జబర్దస్త్ లో మంచి ఆర్టిస్ట్ గా అనిపించుకున్న అవినాష్.. ఆర్ నారాయణ మూర్తి గారి వాయిస్ సాయి కుమార్ గారి వాయిస్ ఇమిటేట్ చేయడంలో స్పెషలిస్ట్. అతని లాగే గుర్తింపు తెచ్చుకున్న కెవ్వుకార్తిక్ తో కలిపి జబర్దస్త్ నిర్వాహకులు వారికి ఒక టీమ్ ఏర్పాటు చేశారు. మాస్ అవినాష్ కెవ్వు కార్తిక్ టీం కొన్ని ఎపిసోడ్స్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే అవినాష్ జబర్దస్త్ టీం లీడర్ గా ఉండి బిగ్ బాస్ కి పోవడంతో అయిన కెవ్వుకార్తిక్ ప్రమోషన్ వచ్చింది. ఈ తరహాలో అతడు సోళో టీం లీడర్ గా వచ్చే వారం నుండి కనిపించనున్నాడు.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అవినాష్ లేకపోవడంతో కార్తీక్ కు కొన్ని ఎపిసోడ్స్ కు మాత్రమే ఛాన్స్ ఇచ్చారట. ఆ తర్వాత టీమ్ లీడర్ గా కార్తీక్ తప్పుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. బాగా పర్ఫార్మ్ చేస్తే కొనసాగించాలని లేకుంటే ఒక మూడు నాలుగు స్కిట్ల తర్వాత తప్పించాలని జబర్దస్త్ యూనిట్ భావిస్తున్నట్టు ఒక వార్త లీక్ అయింది. ఆ టార్గెట్ ఎపిసోడ్స్ లోనే కార్తీక్ తన సభ్యులతో నైపుణ్యత నిరూపించుకోవాలట.