బిగ్ బాస్ 4 : ఇంత ఫైర్ ఇన్ని రోజులు ఎక్కడ దాచావు మోనాల్…? అవినాష్, అరియానాలకి ఫుల్ కోటింగ్

నాలుగో సీజన్ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరకుంది. గ్రాండ్ ఫినాలే కు రంగం సిద్ధం అవుతుండగా కంటెస్టెంట్ లు అందరూ టైటిల్ పై కన్నేసి వారాంతంలో నాగార్జున ఇచ్చిన సూచనల ప్రకారం తమ వ్యూహాన్ని, ఆటతీరును మార్చుకుంటున్నారు, ఇదే క్రమంలో 85 వ రోజు కి సంబంధించిన ప్రోమో లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒకరితో ఒకరు విపరీతంగా కొట్లాడుకున్నారు.

 

నామినేషన్ సందర్భంగా అరియానా…. మోనాల్ ను నామినేట్ చేసి ఆమె ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోవాలి అన్నట్లు రెండు పాయింట్లు చెప్పింది. మొదటి పాయింట్ కి మోనాల్ సమాధానం చెప్పిన తర్వాత రెండవ పాయింట్ పై క్లారిటీ ఇవ్వాలని అరియానా కోరింది. అయితే మోనాల్ మాత్రం అరియానా అన్నదానికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కౌంటర్ ఇచ్చింది. నాకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో… నువ్వు చెప్పకూడదు అంటూ ఎదురు ప్రశ్న వేసింది.

అయితే నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే అంటూ అరియానా బెట్టు చేసింది. అప్పుడు నీకు అన్ని విషయాలు చెప్పడానికి నువ్వు అడిగిన ప్రతి దానికి సమాధానం ఇవ్వడానికి నువ్వేమి బాస్ వి కాదు అని మోనాల్ ఇంగ్లీష్ లో అరిచింది. ఇలా మోనాల్, అరియానా మధ్య ఇంగ్లీష్ లో సంభాషణ జరుగుతుండగా తెలుగులో మాట్లాడండి అంటూ అవినాష్ జోక్యం చేసుకున్నాడు.

అయితే ఒక్కసారిగా నేను మాట్లాడేటప్పుడు నువ్వు అడ్దుపడకు అని మోనాల్ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది. ఇక నేను జస్ట్ తెలుగులో మాట్లాడమని సూచించాను అని అవినాష్ చెప్పినప్పటికీ మోనాల్ మరింత రెచ్చిపోయింది. తను మాట్లాడేటప్పుడు అందరూ అడ్దుపడుతుంటారని ప్రతి ఒక్కరు మాట్లాడేవారే అంటూ గట్టిగా అరిచింది. ఇలాంటి పరిస్థితుల మధ్య నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరుగుతున్న సరైన టైంలో మోనాల్ తన లోని ఫైర్ ను బయటకు తీసినట్లు తెలుస్తోంది.