బిగ్ బాస్ 4 : ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరో చెప్పేసిన నాగబాబు

జబర్దస్త్ కామెడీ షో ద్వారా నవ్వుల నవాబు గా పేరొందిన నాగబాబు ఈ మధ్యకాలంలో ఎక్కువగా బుల్లితెర కే పరిమితం అయిపోయారు. సిల్వర్ స్క్రీన్ పైన ఆయన కనిపించి చాలా రోజులు అవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి అంకానికి చేరుకుంది.ఇక సెలబ్రిటీలను సైతం ఈ షో కదిలిస్తోంది. నాలుగవ సీజన్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా ప్రముఖులు ఈ రియాలిటీ షో పైన స్పందిస్తున్నారు.

 

ఇక ఈ లిస్ట్ లో చేరాడు మెగా బ్రదర్ నాగబాబు. బిగ్ బాస్ విన్నర్ ఎవరో జోస్యం చెప్పారు. అయితే జబర్దస్త్ లో నాగబాబు కి అవినాష్ బాగా సన్నిహితుడు. అతనిని కాదని నాగబాబు వేరొకరి పేరు చెప్పడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో జబర్దస్త్ ఆర్టిస్టులు కొంతమంది అవినాష్ కు మద్దతుగా వీడియో లు పెడుతూ ఓట్లు వేయమని అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవినాష్ ఈ వారం నుండి నేరుగా ఫైనల్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. షో చివరి భాగానికి వచ్చేసరికి ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా కొద్దికొద్దిగా మారుతున్నాయి.

బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి క్రమంగా ఒక్కొక్క సెలెబ్రిటీలు స్పందించడంతో ఓటింగ్ విధానం పై కూడా ప్రభావం చూపుతుంది. తమ అభిమాన సెలబ్రిటీలు ఎవరికి మద్దతు చెబుతున్నారో ఫ్యాన్స్ కూడా వారికే మొగ్గుచూపుతున్నారు. దీని ద్వారా చాలామంది హౌస్మేట్స్ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు అని అంటున్నారు. తాజా ఈ షో పై స్పందించిన నాగబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. జబర్దస్త్ జరుగుతున్న సమయంలో ఏర్పడిన బంధం అవినాష్ తో ఇంకా ఉందని… హౌస్ లో అతను బాగా ఎంటర్టైన్ చేస్తాడు అని అన్నాడు.

అయితే ఈ సీజన్ లో అందరూ బాగా ఆడుతున్నారు…. వాళ్ళందరి లో నాకు అభిజిత్ టైటిల్ విన్ అవుతాడు అని అనిపిస్తుంది అని నాగబాబు కామెంట్ చేయడం గమనార్హం. ఆడే విధానం నాకు నచ్చింది ఎప్పుడు చాలా కూల్ గా కనిపిస్తాడు అని అన్నారు. నా ఉద్దేశంలో అభి నే విన్నర్ అవుతాడు అని నాగబాబు చెప్పాడు. ఇక అభిజిత్ తో తాను ముందే మాట్లాడతాడని…. అయితే ముందు చూసి అతని కెరీర్ బాగుంటుంది అనుకున్నప్పటికీ అది ఎందుకో కుదరలేదు అని నాగబాబు చెప్పాడు. బిగ్బాస్ లో అయినా అభిజిత్ సక్సెస్ అవ్వాలని నాగబాబు కోరుకుంటున్నట్లు తెలిపారు.