బిగ్ బాస్ 4 : నాగార్జున ప్లాన్ అదిరింది..! హారికకు అభిజిత్ కి మధ్య గొడవ పెట్టేశాడు

బిగ్ బాస్ ఫోర్ తెలుగు గ్రాండ్ ఫినాలే కు చేరువయ్యింది. మిగిలిన చివరి ఏడుగురు కంటెస్టెంట్స్ ఒకరితో ఒకరు పోటాపోటీగా పోరాడుతున్నారు. ఇక మధ్యలో ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఎంతైనా గత వారం ఎలిమినేషన్ చాలా బోర్ కొట్టించింది అని చెప్పాలి. దీంతో నాగార్జున చేతులు జోడించి మరీ కంటెస్టెంట్స్ ను సరైన గేమ్ ఆడమని కోరాడు.

 

ఇక ఈ వారం కంటెస్టెంట్స్ అందరికీ అవసరమైన కిక్ ఇస్తారా లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది కానీ నామినేషన్ల ప్రక్రియ విషయమై విడుదలైన ప్రోమా మాత్రం అంచనాలు పెంచేసింది. ఇప్పటిదాకా మిత్రుల్లా ఉన్న వారు ఒక్కసారిగా శత్రువులు అయినట్లు తెలుస్తోంది. ఇదంతా వారాంతపు ఎపిసోడ్ లో నాగార్జున వల్ల జరిగిందని అంటున్నారు. ఇక హారిక ను నాగార్జున కొద్దిగా జ్ఞానోదయం చేసి పంపించినట్లు తెలుస్తోంది.

గతవారం అభిజిత్ ని కాపాడేందుకు వెన్నుపోటు పొడిచింది. ఆ తర్వాత టాస్క్ చేయను అని చెప్పినప్పుడు కూడా హారిక అభి ని సపోర్ట్ చేసింది కానీ హారిక కు ఈవారం జ్ఞానోదయం అయింది ఏమో తెలియదు కానీ అభిజిత్ ను నామినేట్ చేసి షాక్ ఇచ్చింది. ఇక అభి ఆ షాక్ నుండి తేరుకుని నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎవరూ నన్ను అర్థం చేసుకోలేరు అని ఫీల్ అయ్యాడు.

మొత్తానికి నాగార్జున అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్గా ఇంటిలో ఇద్దరు స్నేహితులని విడగొట్టి నామినేట్ చేసేలా చేసాడు.