బిగ్ బాస్ ను బెదిరించడం షో లో నుండి…. బయటికి వెళ్ళిపోతా అని బ్లాక్మెయిల్ చేయడం ప్రతి సీజన్లో చూస్తూనే ఉన్నాం. ఎవరో ఒకరు బిగ్బాస్ ఒఐ ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారిలో మొదటి సీజన్లో శివబాలాజీ వాటర్ సరిగ్గా రావడం లేదని ఫైర్ అయ్యాడు. అతను ఎంత కటువుగా మాట్లాడినప్పటికీ అతను మాట్లాడిన ప్రతి మాటలోనూ అర్థం ఉంది.
ఆ తర్వాత ఇంట్లో నుండి వెళ్లిపోతా అంటూ మహేష్ విట్టా కూడా గత సీజన్లో బెదిరించాడు. తాజాగా నోయల్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే బిగ్బాస్ కి ఎదురుతిరిగి ఇప్పటి వరకు ఎదిరించి సక్సెస్ అయింది లేదు. కేవలం శివ బాలాజీ మాత్రమే అతనిని ఎదిరించి సక్సెస్ అయ్యాడు. కానీ చివరికి బిగ్ బాస్ నే ఎదిరిస్తే బిగ్ బాస్ మాత్రం ఊరుకుంటాడా…? బిగ్బాస్ పైన నోయల్ ఎండుకు ఫైర్ అయ్యాడు.. అసలు సంగతి ఏంటో తెలియదు కానీ నేను మాత్రం నోరు పారేసుకున్నాడు.
ముందు నుండి ఎంతో పకడ్బందీగా నోయల్ గేమ్ ఆడుతున్నాడు అని అందరికీ అర్థమవుతుంది. చాలా సౌకర్యవంతంగా హౌస్ ను మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్ననోయల్ ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ పైన రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ప్రకృతి ఎంత మంచిదో అంతే చెడ్డది అని అతను భారీ భారీ డైలాగులు కొట్టడంతో పాటు బిగ్బాస్ సారి చెప్పాలని అనేసాడు. ఈ వారం ఎలిమినేట్ అయిపోయినా పర్వాలేదు కానీ నాగార్జున సార్ కి చెప్పి వెళ్ళిపోతాను అని నోయల్ ఫస్ట్రేషన్ చూపించాడు.
Papam edo frustration lo unnadu mana #Noel#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/vDaO99Lnyg
— starmaa (@StarMaa) September 18, 2020
అయితే ఇందుకు తగ్గట్టు బిగ్బాస్ కూడా ఒక అసాధారణ టాస్క్ తో నోయల్ కు సమాధానం ఇవ్వబోతున్నాడని సమాచారం. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నోఉయల్ అతని కోపాన్ని తను నిరూపించుకోవాలి అంటే కచ్చితంగా బాగా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకే నోయల్ కెప్టెన్ గా ఉన్నప్పుడు అతనికి గడ్డుకాలం క్రియేట్ చేసే యోచనలో ఉన్నారట. అక్కడ అతను సఫలమయితే నోయల్ కి అడ్డు అనేది ఉండదు.