బిగ్ బాస్ 4 : ఆ కంటెస్టెంట్ పై యూ టర్న్ తీసుకున్న సీజన్ 3 విన్నర్ రాహుల్

బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ షో అయిపోయిన తర్వాత ఒక పెద్ద సెలబ్రిటీ గా మారిపోయాడు. తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కూడా అతను వార్తల్లో నిలవడం కూడా చూడవచ్చు. బార్ లో తాగి చేసిన గొడవ…. పునర్నవితో అతనికి ఉన్న చనువు రాహుల్ ను సెలబ్రేటీని చేశాయి. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇంటర్వ్యూ చేస్తూ రాహుల్ హడావిడి చేస్తున్నాడు.

 

ఇంకా హౌస్ లో జరిగే విషయాలపై రాహుల్ తారచూ స్పందిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ఒక కంటెస్టెంట్ కు మద్దతు పలికిన రాహుల్…. తర్వాత మరో కంటెంట్ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతను లేడీ కంటెస్టెంట్ కు మద్దతు పలకడం గమనార్హం. తన కెరీర్ ఆరంభంలో రాహుల్ సూపర్ హిట్ ప్రైవేట్ సాంగ్స్ తో పాపులర్ అయ్యాడు. మాస్, క్లాస్, రొమాంటిక్ అనే తేడా లేకుండా అన్ని పాటలతో మెప్పించాడు. అతని ఆల్బమ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.

ఇక బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత అతనికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక రాహుల్ కు మంచి ఫ్రెండ్ నోయల్. గత సీజన్లో రాహుల్ విజేతగా నిలవడం లో నోయల్ పాత్ర మరువలేనిది ఇక అందుకని ఈ సీజన్లో కంటెస్టెంట్ అయిన నోయల్ కు రాహుల్ మద్దతు తెలపడంతో పాటు అతని గెలిపించే బాధ్యతను కూడా తీసుకున్నాడు. అనారోగ్యంతో నోయల్ వెళ్లిపోవడంతో రాహుల్ అభిజిత్ కి సపోర్ట్ చేయడం ప్రారంభించాడు.

బహిరంగంగానే అభి కి మద్దతు ప్రకటించిన రాహుల్ ఆ తర్వాత సోహెల్ కు సైతం తన సపోర్టు ఉందని చెప్పాడు. వారం వారం అభిజిత్ కు ఓటు వేసి స్క్రీన్షాట్ కూడా షేర్ చేసే వాడు. ఇక గతంలో మోనాల్ ఆటను తెగ విమర్శించే రాహుల్ ఆమె విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. ఈ వారం నామినేషన్స్ లో మోనాల్ ఉంది…. ఆమెకు ఓటు వేయాలని రాహుల్ తన ఫ్యాన్స్ ను కోరాడు. నా అభిప్రాయం ప్రకారం ఈ వారం నామినేట్ అయిన వారిలో సేవ్ అయ్యే అర్హత మోనాల్ కి ఉంది కాబట్టి అందరూ దయచేసి ఓటు వేయండి అంటూ తన స్టోరీ లో పెట్టుకున్నాడు.