బిగ్ బాస్ 4 : ఆ కంటెస్టెంట్ జైలుకి… విజయం సాధించిన రోబో టీం?

బిగ్బాస్ మూడోవారం బాగా ఊపందుకుంది. రెండవ వారం నాగార్జున కంటెస్టెంట్స్ కు చివాట్లు పెట్టగా మూడవ వారం ప్రేక్షకులకు అవసరమైనంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు కలిసి ప్రేమగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్న వారిని బిగ్బాస్ కూడా దూరం చేసాడు. నామినేషన్ ప్రక్రియ దగ్గర పెద్ద చిచ్చుపెట్టిన బిగ్ బాస్ ఉక్కు గుండే టాస్క్ ద్వారా వారి మధ్య మరో వేశాడు.

 

అయితే ఈ సీజన్ లో మొట్టమొదటి సారిగా కంటెస్టెంట్ ను బిగ్బాస్ జైల్లో వేయబోతున్నాడట. ఆ విశేషాలు ఏమిటి అంటే ఉక్కు హృదయం అనే ఈ టాస్క్ లో రోబో టీం సభ్యులు రచ్చ రచ్చ చేయగా అటు హ్యూమన్స్ కూడా రోబో ల కు కావాల్సిన చార్జింగ్ తమ గుప్పిట్లో ఉన్నప్పుడు బాగా వారిని బాగానే ఉడికించారు. ఇక ఇద్దరి మొండి పట్టుదల మధ్య అమ్మరాజశేఖర్ సిగరెట్ కోల్పోయాడు.

ఈ దశలో అభిజిత్ కండ బలాన్ని ఉపయోగించకుండా బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. శారీరకంగా రోబో టీమ్ మనుషుల టీం తో కొద్దిగా వెనుకబడి ఉంది. కానీ ఛార్జింగ్ ఎలా సంపాదించాలి అని సూపర్ ఐడియా తో మనుషుల టీమ్ సభ్యురాలైన దివి ని కిడ్నాప్ చేశారు. అందరూ కలిసి ఆమె దగ్గర చార్జింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చివరికి అభిజిత్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయిపోయిందని.. రోబో టిమ్ టాస్క్ లో గెలుపొందినట్లు లీకులు బయటకు వచ్చేశాయి. అయితే నోయల్ కూడా ఏదో చేసి జైలు కి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. ఇక నోయల్ ఏదైనా తప్పు చేశాడా లేదా కెమెరా కి దిండు అడ్డి పెట్టడం వల్ల అతన్ని జైల్లో వేశారా అన్నది ఇంకా క్లారిటీ లేదు.