బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగవ సీజన్ కు సంబంధించిన ఓటింగ్ లైన్లు శుక్రవారం తో ముగిసిపోయాయి. అయితే తమ అభిమాన కంటెస్టెంట్ ను గెలిపించుకునేందుకు ప్రేక్షకులంతా ప్రతిరోజు ఓట్లు వేశారు ఈ క్రమంలో ఉన్న ఐదుగురిలో ఒకరిద్దరు కంటెస్టెంట్ లు భారీ ఓటింగ్ సంపాదించుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇక సీజన్ మొదలైనప్పటి నుండి హవా అంటే అభిజిత్ దే అని తెలిసిందే. ఏ ఇతర కంట్స్తెటేంట్ కూడా 14 వారాల్లో అతనినీ మించి ఓటింగ్ శాతం నమోదు చేసుకో లేదు ఇక చివరి వారం కూడా అతని ప్రభంజనం అలాగే కొనసాగినట్లు చెబుతున్నారు.
అయితే 14వ వారంలో ఓటింగ్ క్లోజ్ చేయడానికి ఒక రోజు ముందు అంటే గురువారం రాత్రి అభిజిత్ టాప్ లో ఉన్నాడు. ఓట్లలో సగానికి పైగా అతని ఓట్లే. దాదాపు 60 శాతం ఓట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక హాట్ స్టార్ యాప్ లో వచ్చే ఓట్లలో అభిజిత్ కు ఎదురు లేదు కానీ మిస్డ్ కాల్ డేటా విషయానికి వస్తే అభిజిత్ కొంచెం గట్టిపోటీ ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
మిస్సిడ్ కాల్ డేటా లో అరియానా ముందంజలో ఉన్నట్లు సమాచారం. దీంతో మిస్డ్ కాల్ ఓటింగ్ పరంగా ఆమె ముందుకు వచ్చిందని అంటున్నారు. అంతేకాకుండా అభి పైన ఆధిపత్యం చెలాయించింది అని చెబుతున్నారు. సోహెల్ కూడా యాప్ లో మంచి ఓట్లు సాధించాడు. అయితే మిస్డ్ కాల్ డేటా అరియానాకు అనుకూలంగా ఉంది అని అంటున్నారు. ఇక రెండవ స్థానం కోసం కనుక మిస్సిడ్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తే అతి తక్కువ తేడాతో అటు సోహెల్ లేదా అరియానా రన్నరప్ గా నిలుస్తారు అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.