బిగ్ బాస్ నాలుగో సీజన్ 5వ వారం షో చాలా రసవత్తరంగా సాగుతోంది. ‘బిబి హోటల్’ టాస్క్ అయితే సోహెల్, మెహబూబ్ కోపం…. అవినాష్ జోకులు…. అభిజిత్, అఖిల్ యాటిట్యూడ్ తో చాలా ఘనంగా సాగుతోంది. ఇదే సమయంలో ఎవరు ఊహించని విధంగా అసలు చాప కింద నీరులా చల్లగా ఒక ప్రేమకథ ప్రవహిస్తుంది.
వివరాల్లోకి వెళితే అవినాష్ అరియానా మధ్య చిలిపి మాటలు, చేష్టలు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. అవినాష్ ను అరియానా అయితే ఒక రేంజ్ లో ఆడుకుంటుంది. ఇంటిలో బాగా కొనసాగుతున్న ఈ టాస్క్ లో హోటల్ స్టాఫ్ కస్టమర్స్ దగ్గర ఎలాగైనా టిప్ సంపాదించాలి.
అలా ప్రిన్సెస్ క్యారెక్టర్ చేస్తున్న అరియానా తనను ఇంప్రెస్ చేయమని అవినాష్ ని కోరింది. అలా అరియానా తాము మాటలతో చేయలేనని అవి చెబితే డాన్స్ చేయమని అడిగింది. తర్వాత కూడా నాకు నాట్యం అవసరం లేదు స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ అరియానా ది ప్రిన్సెస్ అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తి రావాలి అని అవినాష్ ను సూచించింది. గాల్లో తేలిపోతూ అవినాష్ అదే పని చేశాడు.
అలా చూసి పూర్తిగా ఫిదా అయిపోయి అరియానా టిప్ ఇచ్చింది. అవినాష్ వెంటనే దాన్ని ముద్దుపెట్టుకున్నాడు. మోకాళ్లపై కూర్చుని ఆమె చేతిని ముఖానికి అడ్డుగా పెట్టుకుని ఫీలయ్యాడు. ఆ తర్వాత అవినాష్ అరియానా ను కౌగిలిలో బంధించాడు. తర్వాత వాళ్ళ అల్లరికి అడ్డు లేకుండా పోయింది.
ఆ తర్వాత అవినాష్.. అరియానాతో నువ్వు రాక్షసి వి అని చెప్పి నాలుక కరుచుకున్నాడు. అందుకు అరియానా ఇప్పటివరకు నేను నిన్ను వాడుకున్నట్లు ఎవరిని వాడుకోలేదు అని చెప్పింది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఇంత సున్నితంగా పోతూ ఉంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. అఖిల్-మోనాల్-అభిజిత్ లలా కాకుండా చాలా ఫన్నీగా ఉండడంతో సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి ఓ జంట లవ్ ట్రాక్ వినోదంగా మారుతోంది.