Bimbisara: న్యూ క్లిక్ ఆఫ్ “బింబిసార”..!!

Share

Bimbisara: కళ్యాణ్ రామ్ మొదటిసారిగా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా “బింబిసార“.. నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. మైథికల్ ల్యాండ్ లో బార్బేరియన్ కింగ్ గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి మరో సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్..

Bimbisara: new poster released
Bimbisara: new poster released

Read More: Prasanth Varma: టాలీవుడ్ తొలి సూపర్ హీరో సినిమా హనుమాన్..!!

డెబ్యూ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాని హరికృష్ణ కే అలాగే కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా మోషన్ పోస్టర్ తోనే ఆసక్తిని కలిగించారు. బింబిసారుడు లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది.. ఈ సినిమా టైం ట్రావెలింగ్ జానర్ కాబట్టి సినిమా ఆదిత్య 369 సినిమా లాగా ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్.. పటాస్ సినిమాతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత తీసిన సినిమాలతో అంతగా మెప్పించలేకపోయాడు.. ప్రస్తుతం కళ్యాణ్రామ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. మరి ఈ సినిమాతో అయినా ఆ నిరీక్షణకు పుల్ స్టాప్ పడుతుందేమో వేచి చూడాలి.


Share

Related posts

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Special Bureau

జగన్ ఈగో టచ్ అయ్యిందిగా .. మోడీ మీద పోరాడతాడా ??

sekhar

Galwan Clash: చైనాలో జర్నలిస్ట్ కు 8ఏళ్లు జైలు శిక్ష..! ఎందుకంటే..!!

Srinivas Manem