Biryani : బిర్యానీ.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఐటమ్..! బిర్యానీ లవర్స్ కచ్చితంగా వారానికి మూడు సార్లైనా తినందే నిద్ర కూడా పట్టదు..! ఎన్నిసార్లు ఇంట్లో చేసుకుంటున్న రెస్టారెంట్ కి వెళ్లి తింటే అదో మజా.. తక్కువలో తక్కువ అ వేసుకున్న ప్లేట్ బిర్యానీ 150 ఉంటుంది.. ఇప్పుడు అదే బిర్యాని రూ.10 కే వస్తే..? ఏంటి జోకా.. అనుకుంటున్నారా.. కాదండి ఇది నిజమే..! అయితే రేటు తక్కువ.. క్వాలిటీ బాగోదేమో.. టేస్ట్ ఉండదేమో అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే..!! తక్కువ రేట్ అయినా బిర్యానీ క్వాలిటీ తో పాటు సూపర్ టెస్ట్ ఉంటుందంటున్నారు అక్కడ తిన్నవారు..!! ఇంతకీ అక్కడంటారా…. ఇంకెక్కడ మన హైదరాబాద్ లోనే..!!
హైదరాబాద్, అఫ్జల్ గంజ్ ఏరియా లోని అస్కా బిర్యానీ స్టాల్ (Aqsa biryani stall).. అఫ్జల్ గంజ్ బస్ స్టాప్ దగ్గరకు వెళ్లి.. ఈ స్టాల్ పేరు చెప్పి అడ్రస్ అడిగితే ఎవరైనా చూపిస్తారు.. చూడడానికి పాత హోటల్ లో ఉంటుంది రోజంతా ప్లేట్ బిర్యాని రూ.10 కే అక్కడ అమ్ముతారు.. ఉదయం ఏడు గంటలకే తెరిచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంచుతారు.. పేదవాళ్ళు, రోజువారీ కూలీలకు ఈ హోటల్ ప్రాణం పోస్తోంది.. ఇఫ్తికర్ మొదట్లో ఈ ఏరియాలో గమనించినప్పుడు తక్కువ ధరకు మిల్స్ దొరకట్లేదు అని తెలుసుకున్నాడు.. అందుకే తాను తక్కువ ధరకే అమ్మాలని ఇది ప్రారంభించారు. లాభాలు సాధించడం ఉద్దేశం కాదని ఇఫ్తికర్ సోదరుడు అసద్ తెలిపారు.. మరి మీరు కూడా ఒక సారి ట్రై చేయాలంటే.. చలో అస్కా బిర్యానీ స్టాల్..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?