Blood Cells: ఒంట్లో రక్తం పెరగడానికి మంచి మార్గం ఇదీ..! ఇంట్లో ఉంటూనే 3 నెలల్లో బలంగా మారొచ్చు..!!

Share

Blood Cells: శరీరంలో రక్తం తక్కువగా ఉంది అంటే రోగాలకు స్వాగతం పలుకుతున్నట్లే.. దేహంలో రక్తం ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంటే కొంతమంది ఏమీ కాదులే అనుకుంటారు.. కానీ అది సరైన పద్ధతి కాదు.. రక్తం తగ్గితే దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పలు అధ్యయనాలలో రుజువైంది.. అందువలన రక్తం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.. రక్తహీనత వలన చాలా మందిలో అనిమియా వస్తుంది. చిన్నారులు, మహిళలు, సర్జరీలు అయినా వారు, శారీరకశ్రమ ఎక్కువ చేసేవారు శరీరంలో లో అర్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు పడతారు.. ఒంట్లో రక్తం వృద్ధి చెందేలా అద్భుతమైన చిట్కా ఉంది.. !! దీనిని మూడు నెలలు పాటిస్తే చాలు శరీరానికి కావలసినంత రక్తం వస్తుంది..!!

Blood Cells: Increase in Very Fast Remedies
Blood Cells: Increase in Very Fast Remedies

Blood Cells: రక్తం పెరగడానికి అద్భుతమైన చిట్కా..!!

కర్పూర శిలాజిత్ (గోదంతి) 30 గ్రాములు తీసుకుని, మండుర బస్మం 10 గ్రాములు తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపి 30 చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గాజు సీసా లో భద్రపరుచుకోవాలి.. వీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒకటి వేసుకొని 10 ఎండుద్రాక్షలను, 5 ఖర్జూరాలను తిని 15 గ్రాముల అలోవెరా జ్యూస్ తాగాలి లేదంటే గోరువెచ్చని నీటినైనా తాగవచ్చు.. ఇలా ప్రతిరోజు పరగడుపున చేయడం వలన చాలా బాగా రక్తవృద్ధి జరుగుతుంది. శరీరానికి అవసరమైన రక్తం అందుతుంది. అలాగే రాత్రిపూట ఒక ఆపిల్ కాయ చేసుకొని పడుకునే ముందు తాగాలి. ఆపిల్ జ్యూస్ లో కావాలనుకుంటే కొంచెం తేనెను కూడా కలుపుకోవచ్చు. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే బ్లడ్ లెవెల్స్ రెండు పాయింట్లు ఖచ్చితంగా పెరుగుతాయి . ఇలా వరుసగా మూడు నెలల పాటు ఈ రెండింటినీ తీసుకుంటే శరీరానికి అవసరమైన రక్తం ఖచ్చితంగా అందుతుంది. దీని వలన ఆరోగ్యానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మూడు నెలలు వాడిన తరువాత వీటిని మరలా తీసుకునే అవసరం లేదు. వీటితో పాటు మీరు తీసుకునే ఆహారం లో ఆకుకూరలు, పచ్చి కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఇంకా త్వరగా మంచి రిజల్ట్ పొందవచ్చు..

Blood Cells: Increase in Very Fast Remedies
Blood Cells: Increase in Very Fast Remedies

Blood Cells: రక్తహీనత లక్షణాలు..!!
శరీరానికి కావలసిన ఐరన్, మినరల్స్ కచ్చితంగా అందించాలి. లేకపోతే రక్తహీనత వస్తుంది. బద్ధకం, మైకం, తలనొప్పి రక్తహీనత లక్షణాలు. మీరు తీసుకొనే డైట్ లో ఖచ్చితంగా ఐరన్, మెగ్నీషియం, మినరల్స్ అందించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి రోజు ఆపిల్, దానిమ్మ,  విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ,  ఖర్జూరం,  అంజీర ఎక్కువగా తినాలి. రక్తహీనతతో బాధపడే వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలి. వచ్చిన ఫలితానికి కనుగుణంగా మీ డైట్ ను సెట్ చేసుకోవాలి. అలాగే పైన తెలిపిన చిట్కాలు కూడా వరుసగా మూడు నెలల పాటు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కా ను ప్రయత్నించి మంచి ఫలితాలను పొందండి.


Share

Related posts

కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా … బీజేపీ ఏం చేస్తోందంటే

sridhar

Cinema Bandi: సినిమా బండి ట్రైలర్ కి అదిరే రెస్పాన్స్..! ప్రముఖుల ప్రశంసలు

Muraliak

పీఎం, ప్రెసిడెంట్ లకు తెలంగాణ సీఎం లేఖలు..! ఎందుకోసమంటే..?

Special Bureau