Blue Tea : అందంగా మెరిసి పోవాలనుకుంటున్నారా.. అయితే ఈ టీ ట్రై చేయండి..

Share

Blue Tea : అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు.. అందుకోసం స్పెషల్ ఫేస్ ప్యాక్ లు, బ్యూటీపార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు.. మీరు తాగే టీ తోనే అందాన్ని పెంపొందించుకోవచ్చు.. అదెలాగంటే.. “బ్లూ” టీ తో.. ఇది ఏంటి ఇప్పటివరకు గ్రీన్ టీ, బ్లాక్ టీ, రెడ్ టీ విన్నాం కానీ.. కొత్తగా ఈ “బ్లూ” టీ ఏంటి అనుకుంటారా.. బ్లూ టీ తో ఎలా అందాన్ని పెంపొందించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Blue Tea : benefits for beauty
Blue Tea : benefits for beauty

శంఖు పువ్వు.. అపరాజితా పుష్పం.. బ్లూ పి.. ఇలా ఏ పేరుతో పిలిచినా , శంకు పుష్పం తో తయారుచేసిన చాయ్ (బ్లూ టీ) మాత్రం అమోఘం..! ఇక ఇందులో కొద్దిగా నిమ్మరసం, అల్లం కలిపామంటే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం..

* జ్ఞాపక శక్తిని పెంచడంలో శంఖపుష్పం టీ పెట్టింది పేరు.

*ఒత్తిడి ఆందోళనలు కోపం ఆస్తమా జ్వరం ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందీ టీ..

*యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే ఈ ఛాయ్ లో అసలు కెఫిన్ ఉండనే ఉండదు.. అయినా మనల్ని శారీరకంగా, మానసికంగా పునరుత్తేజం చేయడంలో బ్లూ టీ కి సాటి మరొకటి లేదు.

*బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఛాయ్ మేలు చేస్తుంది. ఇందులో ఉండే రసాయనిక సమ్మేళనాలు అందుకు దోహదం చేస్తాయి. ఇవి జీవక్రియలను వేగవంతం చేసి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఉపకరిస్తాయి.

*ఈ టీ ని భోజనానికి గంట ముందు లేదంటే గంట తర్వాత తీసుకోవచ్చు.

*ఆరోగ్యానికే కాదు.. అందానికి ఈ బ్లూ టీ ఎంతో మంచిది..

*యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.. ముఖ్యంగా వయసు పైబడి ఛాయల్ని దూరం చేయడానికి, చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. దీని ద్వారా వయసు ఎక్కువగా ఉన్నా కనిపించదు..

*క్రమం తప్పకుండా ఈ టీని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.

*కంటి ఆరోగ్యానికి, మధుమేహం వల్ల కలిగే దుష్ప్రభావాల తో పోరాడటానికి, గుండె ఆరోగ్యానికి ఇలా ఎన్నో రకాలుగా ఇది మేలు చేస్తుంది..

*రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సైతం ఈ టీ లో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

*మెదడును ఉత్తేజం గా ఉంచుతుంది. దానివలన మీరు డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సే ఉండదు..


Share

Related posts

బ్రేకింగ్: వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన జనసేనాని

Vihari

ఫంక్షన్ లకి బాగా రెడీగా అవ్వాలి అనుకునే  అమ్మాయిలకి బెస్ట్ ఐడియా !

Kumar

కెసిఆర్ సాహసి… మరి చంద్రబాబు? ఇదండీ వారి మధ్య తేడా !!

Yandamuri