Boyfriend For Hire: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వంత్, మాళవిక జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్”.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా టీజర్ ను యంగ్ అండ్ మాస్ హీరో విశ్వక్సేన్ రిలీజ్ చేసి టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు..

బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్ చిత్రాన్ని స్వస్తిక సినిమా, ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వేణుమాధవ్ పెద్ది, కే నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీచర్ ని మరింత ఎలివేట్ చేసింది. బాల సరస్వతి విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఈ టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ లెంత్ కామెడీ అండ్ రొమాంటిక్ పొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టీజర్ చూసేయండి..