టాలీవుడ్ లో కీర్తి సురేష్ క్రేజ్ సంపాదించిన తీరు అందరినీ అబ్బుర పరుస్తుంది. మొదట చిన్న హీరోలతో సినిమాలు చేసిన కీర్తికి తర్వాత ‘మహానటి’ తో తన స్టార్ తిరిగిపోయింది. ‘మహానటి’ తర్వాత తాను ఎంతగా పాపులర్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేషనల్ అవార్డు గ్రహీత కు ఇప్పుడు వరుసబెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె కెరీర్ మొదటి నుండి ఇప్పటి వరకు ఎక్కడా అందాల ప్రదర్శన చేయలేదు. గ్లామర్ పాత్రలు చేసింది కానీ ఎక్స్పోజింగ్ కు మాత్రం ఆమడ దూరంలో ఉంటూ వచ్చింది.
అభినయానికి స్కోప్ ఎక్కువగా ఉండే పాత్రలను ఎక్కువగా ఎంచుకునే కీర్తి సురేష్ ఇప్పుడు బికినీ ధరించనుందని…. అది కూడా ఒక టాలీవుడ్ సినిమాలో అని వార్తలు వస్తున్నాయి. గ్లామర్ పరంగా ఇప్పటివరకు హద్దులు దాటిన కీర్తి ఏకంగా బికినీ వేయడం ఏమిటి అని అందరూ షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం కీర్తి సురేష్ బరువు తగ్గడం చూశాం. హీరోయిన్లకు ఉండాల్సిన మొదటి లక్షణం మంచి శరీరాకృతి అని తెలిసిందే. ఎంత టాలెంట్ ఉన్నా కూడా శరీరం మీద పట్టు కోల్పోతే అవకాశాలు తగ్గుతాయి.
ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మిస్ ఇండియా’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ సైతం బరువు తగ్గనుంది. ఇక ఆమె ఇంత సన్నగా అవ్వడానికి కారణం ఆ సినిమాలో బికినీలో నటించడానికేనని…. అందుకోసమే నాజూగ్గా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో మిస్ ఇండియా అనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ఆ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు ఆమె బికినీలో కనపడనుంది అన్న ఈ కథనాలపై కీర్తి సురేష్ స్పందించింది. ఆరోగ్యం కోసమే తాను బరువు తగ్గినట్లు చెప్పిన ఆమె మిస్ ఇండియాలో మాత్రం గ్లామర్ టచ్ ఉంటుంది అన్నట్లు హింట్ ఇచ్చింది. మరి నిజంగానే కీర్తి కనుక బికినీ వేస్తే ఆమె అభిమానులు, కుర్రకారు రెచ్చిపోతారు.