NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Breaking: మహారాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌నకు సుప్రీం గ్రీన్ సిగ్నల్  

Breaking: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ బలపరీక్ష అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గవర్నర్ ఆదేశాల మేరకు రేపు బలపరీక్ష నిర్వహణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్దర్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కొనే అంశంపై సుప్రీం కోర్టులో బుధవారం సాయంత్రం దాదాపు మూడున్నర గంటల పాటు  వాదోపవాదాలు జరిగాయి. ఇటు ఉద్దవ్, అటు ఎక్ నాథ్ శిందే తరపున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారు. అసెంబ్లీలో బలపరీఘను ఎప్పుడూ జాప్యం చేయకూడదని, రాజకీయ జవాబుదారీతనానికి బేరసారాలు జరక్కుండా నిరోధించేందుకు బలపరీక్ష నిర్వహించడమే ఏకైక మార్గమని శిందే తరపు న్యాయవాది నీరజ్ కృష్ణ కౌల్ వాదించారు. ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు అంశం జాప్యమవుతోందన్న కారణం చూపించి బలపరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదని అన్నారు.

Breaking Supreme Court allows floor test in Maharashtra assembly tomorrow
Breaking Supreme Court allows floor test in Maharashtra assembly tomorrow

గురువారం మధ్యాహ్నం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని రాష్ట్ర గవర్నర్ ఆదేశించడాన్ని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీనిపై ప్రభు తరపున హజరైన అడ్వొకేట్ ఏఎం సింఘ్వీ తన వాదనలు వినిపించారు. గురువారమే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం చాలా హడావిడిగా తీసుకున్న నిర్ణయమని, అపవిత్రమని ఆయన అన్నారు. బలపరీక్షను వారం పాటు వాయిదా వేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనల అనంతరం రాత్రి 9 గంటలకు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

 

అవిశ్వాస తీర్మానంపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. కాగా ఒ పక్క సుప్రీం కోర్టు వాదనలు జరుగుతున్న సమయంలో ఉద్దవ్ కేబినెట్ భేటీ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో ఉద్వేగభరితంగా మాట్లాడినట్లు తెలుస్తొంది. రేపు బలపరిక్షకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే నేడు రాజీమానా చేస్తారా లేక అసెంబ్లీ వేదిక గానే రాజీనామా సమర్పిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది.  కాగా ప్రభుత్వ అవిశ్వాస తీర్మానం దృష్ట్యా ముంబాయిలో హైఅలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju