బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణం దేశవ్యాప్తంగా ఎంత చిచ్చు రగిల్చిందో తెలిసిందే. అందులో ప్రధాన ముద్దాయిగా అతని ప్రేయసి రియా చక్రవర్తి ని పోలీసులు అరెస్టు చేశారు.
ఆమెకు వ్యతిరేకంగా వాట్సాప్ చాట్స్ అలాగే సుశాంత్ బ్యాంక్ అకౌంట్ వివరాలు లభ్యం కావడంతో ఏసీబీ అధికారులు రియాను అరెస్టు చేశారు. సుశాంత్ డ్రగ్స్ వాడేందుకు రియా తన వంతు సహకారం అందించిందని… ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు రిపోర్టులో పొందుపరిచారు.
ఇక ఈ కేసులో రియా ఎన్నో రోజుల నుండి బెయిల్ కు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమెకు ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు బాంబే హైకోర్టు నేడు రియా చక్రవర్తికి బెయిలు మంజూరు చేసింది.