వీడియో వైరల్: సింహాన్ని గాల్లోకి ఎత్తి పడేసిన దున్నపోతులు..!

Share

సింహం ఈ పేరులోనే ఎంతో గంభీరత్వం ఉంటుంది. సాధారణంగా సింహాన్ని అడివికి రారాజు అని పిలుస్తుంటారు. సాధారణంగా సింహాన్ని చూస్తే ఎటువంటి క్రూర జంతువులు అయినా వెనుకడుగు వేయాల్సిందే. వేటాడటంలో సింహానిది ఎల్లప్పుడూ పైచేయి అవుతుంది.ఒక్కసారి సింహం చేతికి దొరికామంటే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇంతటి గంభీరమైన సింహాన్ని ఒక సాధు జంతువైనా దున్నపోతు ఒక్కసారిగా తన భయంకరమైన కొమ్ములతో సింహాన్ని గాలిలోకి ఎత్తి పడేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.

అడవిలో గడ్డి మేస్తున్న దున్నపోతులను చూసి వాటిని వేటాడేందుకు అటువైపుగా వచ్చిన సింహానికి బాగా ఎదురు దెబ్బ తగిలింది. గడ్డి తింటున్న దున్నపోతులలో ఒకటి సింహం తమ వైపు రావడాన్ని చూసి ఎంతో ఆవేశంతో తన బలమైన కొమ్ములతో ఒక్క గుద్దు సింహాన్ని గుద్దితే దాని ధాటికి సింహం గాల్లో ఎగిరి పడింది. 25 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో దున్నపోతు సింహం పై ఎలా విరుచుకుపడిందో చూడవచ్చు.

సింహం సాధారణంగా ఎంతో బలమైన జంతువు అయినప్పటికీ కొన్ని సార్లు ఇలా సాదు జంతువుల ధైర్యసాహసాలకు, తెలివితేటల ముందు ఇలాంటి క్రూర జంతువులు సైతం ఓటమిని చవి చూడాల్సిందే. అలాంటి బలమైన సాధు జంతువుల ముందు సింహం ఆటలు కూడా సాగవని చెప్పడానికి ఇదొక మంచి నిదర్శనం. సంకల్పం గట్టిది అయితే ఎలాంటి శక్తి నైనా ఎదిరించవచ్చుననీ ఈ దున్నపోతు చేసిన సాహసమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అతికొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.


Share

Related posts

Paagal Teaser : పాగల్ టీజర్ వచ్చేసిందోచ్ ..

bharani jella

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య ఇంట్లో పార్టీ.. హాజరైన జ్యోతక్క, హారిక, హిమజ, దీప్తి సునయన?

Varun G

పెళ్లి అనేది అంత ఇంపార్టెంటా లైఫ్ లో? షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ?

Varun G