Cab Stories: కెవిఎన్ దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ దివ్య వధ్య, గిరిధర్, ధనరాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్యాబ్ స్టోరీస్.. క్యాబ్ ప్రయాణంలో వీరి జీవితాలు మలుపు తిప్పే కథే ఈ సినిమా. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా విడుదల చేశారు..!!

Read More: ముగ్గురు మొనగాళ్ళు ట్రైలర్.. శ్రీనివాస్ రెడ్డి కామెడీ హైలెట్..!!
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ ఒక్కడే అబ్బాయి ఒక్కతే భార్య.. తెలియక తప్పు చేస్తే తప్పా.. లేదే.. తెలుసుకుని సారీ చెప్తే తప్పా.. కాదే.. అయితే ఈ రెండు నేను చేశాను అంటే నేను కరెక్టే కదా.. అంటూ సాగే ఈ ట్రైలర్.. అమ్మాయిలందరూ మీకు ఆలోచిస్తే అసలు ఏ ప్రాబ్లం రాదు మేడం ఇంతకీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. అంటూ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఈ ట్రైలర్ ముగుస్తుంది.. ఈ ట్రైలర్ చూశాక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అర్థమవుతుంది. థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.. మే 28న స్పార్క్ ఓటీటీలో క్యాబ్ స్టోరీస్ స్ట్రీమింగ్ కానుంది..