18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Google: గూగుల్ నుండి 12వేల ఉద్యోగులకు ఉధ్వాసన పై సీఇఓ సుందర్ పిచాయ్ రెస్పాన్స్ ఇది

sunder pichai
Share

Google: ఆర్ధిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా, అదే బాటలో దిగ్గజ సెర్చింజన్ గూగుల్ కూాడా చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 12వేల మంది ఉద్యోగులను తొలగించాలని గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ లో మాస్ లే ఆఫ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరు శాతం ఉద్యోగులను అంటే 12వేల మందిని విధుల నుండి తొలగిస్తున్నది. ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపించగా, మరి కొందరికి త్వరలోనే ఈ సమాచారం అందించనున్నట్లు తెలిపింది. కోవిడ్ -19 పరిణామాల సమయంలో అప్పటి అవసరాలకు తగినట్లుగా అధిక నియామకాలు చేపట్టామనీ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ చెబుతోంది. ఇదే అంశాన్ని ఉద్యోగులకు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ మెయిల్ ద్వారా తెలియజేశారు.

Google

కఠిన సమీక్షల అనంతరమే ఈ నిర్ణయం

అయితే ఆమెరికాలో గూగుల్ తొలగించే ఉద్యోగులకు కనీసం 60 రోజుల నోటిఫికేషన్ పీరియడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పరిహారం ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు.. గూగుల్ లో పని చేసిన ప్రతి ఏడాదికి రెండు వారాల వేతనంతో పాటు ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగ కల్పన సేవలు, ఇమిగ్రేషన్ విషయంలో సహకారం వంటి ప్రయోజనాలను అందిస్తామని వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు అంశంపై సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ కఠిన సమీక్షల అనంతరం ఉద్యోగుల తొలగింపునకు ప్రకటిస్తున్నామన్నారు. అల్ఫాబెట్ ఉత్పత్తులు విభాగాల, కార్యకలాపాలు, స్థాయిలు, ప్రాంతాల వ్యాప్తంగా ఈ ఉద్యోగాల కోత ఉంటుందన్నారు. అసాధారణ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు కూడా వీడ్కోలు చెప్పాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఈ నిర్ణయం వారి జీవితాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందనే విషయం తనకు ఆందోళన కల్గిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో తొలగింపునకు గురవుతున్న ఉద్యోగులకు ప్రత్యేక మెయిల్ పంపినట్లు తెలిపిన ఆయన .. ఇతర దేశాల్లో అక్కడి చట్టాలు, విధానాల వల్ల ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

sunder pichai
sunder pichai

51 వేల మందికి ఎఫెక్ట్

దిగ్గజ సంస్థలు తీసుకున్న కఠిన నిర్ణయాల ఫలితంగా దాదాపు 50వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పదివేల మంది ఉద్యోగాలను, ఇకామర్స్ అగ్రగామి సంస్థ అమెజాన్ 18వేల మందిని, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా 11వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించగా, తాజాగా గూగుల్ 12వేల మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ నాలుగు దిగ్గజ సంస్థల నుండే దాదాపు 51వేల మంది నిపుణులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. వీరికి అదే స్థాయిలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లభించడం కష్టతరమే అని అంటున్నారు.

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?


Share

Related posts

AP CM YS Jagan: జగన్ సర్కార్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన అచ్చెన్న

somaraju sharma

పురుషులు ఆ విషయం లో స్త్రీల మనస్సు తెలుసుకోక పొతే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు!!

Kumar

సీజన్ ఫోర్ బిగ్ బాస్ ఆ నలుగురు కంటెస్టెంట్ లకు ఆఫర్ల మీద ఆఫర్లు..!!

sekhar