భారత్ కు వచ్చేసిన సమంత.. ఇకపై ఆ పనిలో బిజీ..?

క‌రోనా వైర‌స్ అంద‌రిని భ‌యబ్రాంతుల‌కు గురి చేసింది. సెల‌బ్రిటీల నుంచి మాములు జ‌నం వ‌ర‌కు అంద‌రూ.. కరోనా వ‌స్తుదేమో అనే భ‌యంతో ఇంటి బ‌య‌ట కాలు పెట్ట‌లేదు. కానీ ఎప్పుడైతే.. లాక్ డౌన్ కాలం అయిపోగానే ఒక్కొక్కరుగా బ‌య‌ట‌కు రావ‌డం స్టార్ట్ చేశారు. ఆ క్ర‌మంలోనే విహార యాత్ర‌ల‌కు అనుమ‌తులు కూడా వ‌చ్చాయి. దాంతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ చాలా మంది సినీ హీరో, హీరోయిన్లు దుబాయ్, మాల్దీవులు వంటి ప్రాంతాల‌ను చుట్టేయ‌డానికి ప్రయాణం అయ్యారు.

అందులో ఇప్ప‌టికే మ‌హేష్ బాబు త‌న ఫ్యామిలీతో టూర్ కు వెళ్లిన ఫొటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కూతురు సితార చేసిన అల్ల‌రి ఇప్ప‌ట్లో ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. త‌ను వాళ్లమ్మ మీద చూపిన ప్రేమ అంద‌రిని క‌దిలించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా త‌న ఫ్యామిలీతో క‌లిసి ఓ టూర్ లో చేసిన ర‌చ్చ తెలిసిందే. ఇందులో ర‌కుల్ యోగా చేస్తూ తీసుకున్న ఫొటోలు ఇప్ప‌టికి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక అక్కినేని నాగ చైతన్య, సమంత కూడా టూర్ కు మాల్దీవులకు వెళ్లి అక్క‌డ సంద‌డి చేసిన‌ సంగ‌తి తెలిసిందే. స‌మంత భ‌ర్త హీరో నాగచైతన్య పుట్టిన రోజు వేడుక‌లు కూడా అక్క‌డే జ‌రిగాయి. నాగ చైత‌న్య పుట్టిరోజుకు సంబంధించి మాల్దీవుల్లో తీసుకున్న ఫొటోల‌ను స‌మంత ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ ఫొటోలు చూసిన చైతు, స‌మంత అభిమానులు ఎంతో సంతోష‌ప‌డుతున్నారు.

అయితే మాల్దీవుల్లో వారం రోజుల పాటు అక్క‌డే ఉన్న రిసార్ట్స్ లో తెగ ఎంజాయ్ చేసిన నాగ చైత‌న్య‌, స‌మంత తాజాగా తిరిగి హైద‌రాబాద్ కు చేరుకున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వ‌స్తున్న థాంక్యూ సినిమాలో నాగ చైత‌న్య న‌టించ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక స‌మంత హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సామ్ జామ్ షోలో ఆమె పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆమె ప‌లు సినిమాలో న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. క‌రోనా వ‌ల్ల షూటింగ్ లు జ‌ర‌గ‌డం లేవ‌ని.. అవి స్టార్ట్ అయితే.. ఈ కుంద‌న‌పు బొమ్మ బిజీగా ఉంటార‌ని సమాచారం.