బుల్లితెరపై జబర్దస్త్ క్లిక్ అయినట్లు ఏ కామెడీ షో ఇప్పటివరకు క్లిక్ కాలేదు. ఇక అందులో టీం లీడర్ అయిన చమ్మక్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. సంసారం లో ఉండే కష్టాలు…. భార్య భర్తల మధ్య గొడవలు పై ఎప్పుడూ స్కిట్స్ చేస్తూ ఉండే చంద్ర బాగానే అందరిని మెప్పించాడు. జబర్దస్త్ వేదికగా చమ్మక్ చంద్ర భారీగా ఎదిగాడు. అతను అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా చాలా వాటిలో డైలాగ్స్ లేకుండానే స్క్రీన్ పై కనబడ్డాడు.
అయితే జబర్దస్త్ మాత్రం చమ్మక్ చంద్ర కు మంచి స్టేటస్ తెచ్చిపెట్టింది. జబర్దస్త్ నుండి అదిరింది షో కి వెళ్ళిపోయిన చమ్మక్ చంద్ర గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను వెల్లడించాడు నాగబాబు. జబర్దస్త్ లో చూసినట్లయితే గతంలో చంద్ర స్కిట్లను నాగబాబు బాగా ఎంజాయ్ చేసేవారు. వీరిద్దరి మధ్య ఓ ప్రత్యేక బంధం ఏర్పడింది. జబర్దస్త్ నుండి నాగబాబు వెళ్లిపోయిన సమయంలో చంద్ర కూడా అతని వెన్నంటి నడిచి స్వామి భక్తిని చాటుకున్నాడు.
తనతో పాటు అదిరింది షో కి వచ్చిన వారికి భారీ రెమ్యూనరేషన్ వచ్చేలా చూశాడు నాగబాబు. జబర్దస్త్ కంటే ఎక్కువగా వారికి పారితోషికం లభించడం అక్కడి వారికి అది బాగానే వర్కౌట్ అయింది కానీ టిఆర్పి లో జబర్దస్త్ ను అదిరింది దాటలేకపోయింది. ఇక నాగబాబు మాట్లాడుతూ డబ్బు గొప్పతనం గురించి ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు.
అన్నింటి కన్నా డబ్బు సంపాదించడం గొప్ప పని అది ఒక ఆర్ట్ అని ఆయన ఆన్నాడు. డబ్బును గౌరవించని వారు ఎప్పుడూ ధనవంతులు కాదని చెప్పినా ఆయన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరికంటే ఎక్కువగా బాగా చంద్ర సెటిల్ అయ్యాడు అని చెప్పడం గమనార్హం. అతను ఒక ప్లానింగ్ తో ఎదిగాడు అని ఒక లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు అని…. అది దాదాపు 80 లక్షల నుండి కోటి రూపాయల విలువ ఉంటుందని అన్నారు. చంద్ర కు ఒక బిఎండబ్ల్యు కార్ కూడా ఉందని నాగబాబు చెప్పాడు.