Unstoppable 2: తెలుగు రాజకీయాలలో రాజకీయ చాణిక్యుడిగా చంద్రబాబుకి తిరుగులేని పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేతగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా దాదాపు 40 సంవత్సరాలకు పైగా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఎప్పుడు కూడా చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తారు. చంద్రబాబు నవ్వటం చాలా అరుదు. ఇలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ కి రావటం జరిగింది. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈషో మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14వ తారీకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో మొదటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో అక్టోబర్ 11వ తారీకు సాయంత్రం ఐదున్నర గంటలకు ఆహా విడుదల చేసింది.
ప్రోమోలో చంద్రబాబు చాలా ఎనర్జిటిక్ గా నవ్వుతూ బాలకృష్ణ కే పంచ్ డైలాగులు వేశారు. ఎప్పుడూ ఉండే రీతికి భిన్నంగా చంద్రబాబు ప్రోమోలో చెలరేగిపోయారు. మీరు సినిమాలో మాత్రమే కానీ నేను వయసులో ఉన్న సమయంలో.. కాలేజీలో చదువుతున్న టైములో నీకంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను అంటూ బాలకృష్ణ పైన చంద్రబాబు సెటైర్లు వేశారు. నువ్వు సైలెన్సర్లు పీకి కాలేజీల వైపు తిరిగే వాడివి మాది అలా కాదు అంటూ చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణపై రెచ్చిపోయారు. ఇంకా వైయస్ రాజశేఖర్ రెడ్డి తో ఉన్న స్నేహాన్ని గురించి కూడా షోలో చెప్పడం జరిగింది. ఇంకా ఈ దేశంలోకి నారా లోకేష్ కూడా మధ్యలో రావడం జరిగింది.
ఈ సందర్భంగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోవడం ఇంకా కొన్ని విషయాలపై బాలకృష్ణ ప్రశ్నలు సంధించారు. ఇంకా చంద్రబాబు తో ఆయన భార్య భువనేశ్వరికి బాలకృష్ణ ఫోన్ చేయించి ఐలవ్యూ చెప్పించారు. ఇంకా ఎన్టీ రామారావు టైంలో సంగతులు గురించి కూడా డిస్కషన్ జరిగింది. తన మామ ఎన్టీఆర్ తనకి దైవంతో సమానమని చంద్రబాబు ఈ షోలో చెప్పినట్టు ప్రోమోలో చూపించడం జరిగింది. ప్రోమో అదిరిపోవటంతో.. చంద్రబాబు అనుష్టాపబుల్ ఎపిసోడ్ కోసం వీక్షకులు ఎదురుచూస్తున్నారు.