Varapula Raja: టీడీపీ నేత వరుపుల రాజా శనివారం గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి గుండెలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు రాజా చెప్పడంతో ఆయనను కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలోనే వరుపుల రాజా మృతి చెందాడు.. ఆయన ఇక లేరు అన్న వార్త తెలిసిన టిడిపి శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. టిడిపి అధినేత వరపుల రాజా కి ఘన నివాళి ఇచ్చారు.

ఈరోజు మధ్యాహ్నం పత్తిపాడు లోని వరపులు రాజా భౌతిక కాయనికి చంద్రబాబు నివాళులు అర్పించారు. రాజా కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. రాజా కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నాయకులు కూడా అక్కడికి చేరుకొని వరపుల రాజాకి నివాళులు అర్పించారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాలూరు,బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు వరుపుల రాజా ఇంచార్జీగా ఉన్నారు. శనివారం నాడు మధ్యాహ్నం వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల విషయమై పార్టీ నేతలతో రాజా సమావేశాలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. నిన్న సాయంత్రం ఆయన ప్రత్తిపాడుకు చేరుకున్నారు. ప్రత్తిపాడు లో పార్టీ నాయకులు , కుటుంబ సభ్యులు, బంధువులతో రాత్రి 9 గంటల వరకు ఆయన గడిపారు. అదే సమయంలో తనకు గుండెలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడం , ఆయనను కుటుంబ సభ్యులు కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాజాకు రెండు దఫాలు గుండెపోట్లు వచ్చాయి. దీంతో రాజాకు వైద్యులు స్టంట్లు వేశారు.