Unstoppable 2: ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మొదటి సీజన్ “అన్ స్టాపబుల్” షో చాలా రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా చేసిన ఈషో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు, ప్రముఖులు, దర్శకులు, నటీనటులనీ ఇంటర్వ్యూ చేసిన ఈషో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ టాకీ షోలో మొదటి సీజన్ లో మహేష్ బాబు, రవితేజ, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, నాని, అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీనివాస్, శ్రీకాంత్, సుకుమార్, బ్రహ్మానందం, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు రావటం జరిగింది.
అయితే “అన్ స్టాపబుల్ 2” మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలయ్య బాబు “అన్ స్టాపబుల్ 2” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరికొద్ది క్షణాలలో ప్రోమో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు “అన్ స్టాపబుల్ 2″లో ఫస్ట్ ఎపిసోడ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో చేయటం జరిగింది. ఇందుకు సంబంధించి షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బావకు బామ్మర్ది ఎటువంటి ప్రశ్నలు వేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంకా “అన్ స్టాపబుల్ 2″లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా చాలామంది బిగ్ స్టార్స్ రానున్నట్లు సమాచారం.
అన్ స్టాపబుల్ మొదటి సీజన్ కి మంచి క్రేజ్ రావటంతో..”అన్ స్టాపబుల్ 2″ మరింతగా గ్రాండ్ గా ఉండాలని షో నిర్వాహకులు ప్లాన్ చేయటం జరిగిందట. ఈ క్రమంలో ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు షోకి రావటం సంచలనంగా మారింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!