తిప్పతీగ చూర్ణంతో మధుమేహానికి చెక్ పెట్టండి ఇలా..?

ప్రస్తుత కాలంలో రోజురోజుకి మధుమేహా బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. అందుకు గల కారణం కొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మరికొందరికి ప్రస్తుత ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు.అయితే ఈ వ్యాధితో బాధపడే వారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధుమేహంతో బాధపడే వారు రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉండాలంటే తిప్పతీగ చూర్ణం మంచి ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఈ తిప్పతీగలను పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో ఒక ఔషధంలా ఉపయోగిస్తున్నారు.తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ మన శరీరంలోకి ప్రవేశించిఎన్నో రకాల సూక్ష్మజీవులను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ని ఔషధ గుణాలున్న తిప్పతీగల చూర్ణాన్ని మధుమేహంతో బాధపడేవారు ఉదయం సాయంత్రం రెండు పూటలా తీసుకోవడం ద్వారా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నిలకడగా ఉంచుతుంది.

కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు తిప్పతీగ చూర్ణాన్ని గోరువెచ్చటి పాలలో కొద్దిగా అల్లం రసంతో పాటు కలుపుకుని ప్రతిరోజు రెండు పూటల తాగడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగు పడాలంటే తిప్పతీగ ఆకుల పొడిని కొద్దిగా బెల్లంలో కలిపి తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. ఈ తిప్పతీగలను చూర్ణం,గుళికలు,పొడి రూపాయలు తీసుకుంటారు. మధుమేహంతో బాధపడే వారు ప్రతి రోజు ఉదయం సాయంత్రం 2 ఆకులను నమలడం ద్వారా మధుమేహం పూర్తిగా సాధారణ స్థాయిలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.