భారీ వర్షాల దెబ్బకు చెన్నై అతలాకుతలం..!

నివర్ తుఫాను అనుకున్నట్లుగానే చెన్నై మహానగరాన్ని కుదిపేసింది. అందరి అంచనాలు నిజమయ్యాయి. ఆంధ్రరాష్ట్రంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపుతుంది అనుకున్నా ఈ తుఫాను చెన్నై లో ప్రభావాన్ని చూపించింది.

 

వాతావరణ నిపుణులు అంచనాలకు తగ్గట్లు చెన్నై లో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగర వాసులంతా తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. చాలాచోట్ల వర్షాల దెబ్బకు పెద్దపెద్ద చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోగా మహానగరంలో విమాన సర్వీసులను నిలిపివేశారు. గతంలో భారీ వర్షాలు పడ్డప్పుడు చెన్నైలో జరిగిన డ్యామేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సమయంలో అంతకుమించిన డ్యామేజీ ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరో ఒకటి రెండు రోజులు ఇంకా తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. భారీ వర్షాలను ముందుగానే అంచనా వేసిన అధికారులు బాగా లోతట్టు ప్రాంతాలకు చెందిన వారిని సురక్షిత స్థలాలకు తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది అనే చెప్పాలి. భారీ వర్షానికి చెన్నై లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోగా…. చెంబరాంబక్కం నీటి సరస్సులో ప్రవాహం పెరిగింది. ఇక రిజర్వాయర్ నుండి నీటిని దిగువకు విడుదల చేశారు .

ఈ వర్షం ధాటి ఎంతలా ఇంది అంటే…. గత ఐదేళ్లలో తొలిసారిగా ఈ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. ప్రత్యేక శిబిరాలకు పాతిక వేల మంది పైగా జనం తరలి వెళ్లారు. మహా నగరం అంతా సెలవు ప్రకటించారు. ఇక రేపు రాత్రి వరకు తుఫాను తీవ్రత కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తుంటేమత్స్యకారులని సముద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రేపు అర్థరాత్రికి కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది అని… అందరూ బయటకి రాకుండా ఇళ్ళ వద్దనే ఉండాలని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాలను వర్షం తీవ్రంగా ప్రభావితం చేయడం గమనార్హం