బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ కావటానికి మరి కొద్ది రోజులే ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఆడియన్స్ ఈసారి హౌస్ లోకి ఎవరు వస్తారు అన్నదానిపై ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ సీజన్ నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ సీజన్ 6లోకి టాప్ మోస్ట్ సెలబ్రిటీలు రానున్నారట. గత సీజన్ లలో చాలా వరకు సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకువచ్చారు. విలతోపాటు న్యూస్ యాంకర్ లు మరియు పాపులర్.. టెలివిజన్ యాంకర్ లు రావటం జరిగింది.
అయితే ఈసారి ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళనే ఇంటి సభ్యులుగా తీసుకురావడం జరిగింది అంట. దీనిలో భాగంగా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన ఫిమేల్ కంటెంట్ గా తీసుకున్నట్లు టాక్. పూర్తి విషయంలోకి వెళ్తే “నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా నటించిన సుదీప సీజన్ 6లో రానున్నట్లు సమాచారం. “నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో పింకీ పాత్రలో సుదీప నటించి… మంచి కామెడీ పండించింది. సినిమాలో హీరో వెంకటేష్ పై సెటైర్ లు కూడా వేయడం జరిగింది. దీంతో సుదీపనీ సీజన్ 6లో తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందుకు గాను సుదీపకి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఈ సీజన్ లో ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా కంటెస్టెంట్ గా సీజన్ సిక్స్ లోకి రానున్నట్లు సమాచారం. మొత్తం మీద వస్తున్న వార్తలు బట్టి చూసుకుంటే ఈ సీజన్ లో ఎక్కువగా ఇండస్ట్రీకి చెందిన వాళ్లను తీసుకున్నట్లు తెలుస్తోంది.