Skin Tone: చిన్నపిల్లలు ఏ రంగుతో పుట్టినప్పటికీ సరైన కేర్ తీసుకోకపోతే నల్లగా మారి పోతారు.. ప్రతిరోజు వారికి సబ్బుతో స్నానం కాకుండా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తెల్లగా మెరిసిపోతారు.. పిల్లలకి స్నానం చేయించే ముందు ఏం రాస్తే ముత్యంలా మెరిసిపోతారో చూద్దాం..!!
పిల్లల శరీరతత్వానికి పాలమీగడ అద్భుతంగా పనిచేస్తుంది స్నానానికి మూడు నిమిషాల ముందు పాలమీగడ రుద్ది సున్నిపిండితో స్నానం చేయాలి. లేదంటే మూడు టేబుల్ స్పూన్ల పాలమీగడ తీసుకొని దాంట్లో కొద్దిగా పెసలు వేసి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పిల్లల చర్మం పై అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయించాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే పిల్లల మేని రంగు మిలమిలా మెరిసిపోతోంది..
చిన్న పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఏది పడితే అది రాస్తే శరీరంపై అలర్జీ, ఎర్రటి దద్దుర్లు, పొక్కులు వస్తాయి.. కొంత మంది పిల్లలకి కొబ్బరినూనె, బాడీ ఆయిల్ పడవు. అటువంటి పిల్లలకి ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె చక్కగా పనిచేస్తాయి. స్నానానికి ఐదు నిమిషాల ముందు ఆలివ్, నువ్వుల నూనెను మర్దన చేసి ఆ తరువాత పెసరపిండి తో స్నానం చేయించాలి. ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే పిల్లలు రంగు మారి తెల్లగా వస్తారు..