China Rocket: ప్రపంచాన్ని కంగారుపెట్టిన చైనా రాకెట్ సముద్రంలో కలిసింది..!!

China Rocket: Latest Update about China Rocket
Share

China Rocket:  పది రోజుల నుండి భూగోళాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ ఎట్టకేలకు భూమికి చేరింది. భూమి నుండి పైకెళ్ళి.. గతి తప్పి.. మళ్ళీ భూగోళానికి చేరే అవకాశాలున్నప్పటికీ.. ఎక్కడ పడుతుందో..? ఏ దేశాన్ని నాశనం చేస్తుందో తెలియక వారం రోజుల పాటూ ప్రపంచం కంగారు పడింది. ఇండియాలో పడుతుందనీ.. ఢిల్లీలో పడుతుందనీ వార్తలు రావడంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందారు.. దీనిపై చైనా శాస్త్రవేత్తలు కూడా సరైన అంచనాలు వేయలేకపోయారు. చివరికి ఆ రాకెట్ గంట సేపటి కిందట హిందూ మహాసముద్రంలో పడింది.

China Rocket: Latest Update about China Rocket
China Rocket: Latest Update about China Rocket

China Rocket: ఇదీ విషయం..!

ఈ రాకెట్ ఏప్రిల్ 29న భూమి నుంచి బయలుదేరింది. చైనా స్పేస్ స్టేషన్‌ తియాన్హే (Tianhe)కి చెందిన అత్యంత కీలకమైన కోర్ మాడ్యూల్‌ని భారీగా మోసుకెళ్లింది. “లాంగ్ మార్చ్ 5B రాకెట్” అనే పేరుతో ఇది పైకి వెళ్లిన గంటలోనే గతి తప్పింది. పది రోజుల నుండి ఎక్కడ పడుతుందో తెలియలేదు. లైవ్ లో చూసినప్పటికీ.. అది అటూ ఇటు దిశా మారుస్తూ వచ్చింది. కచ్చితంగా ఈరోజు ఉదయం భూమిపై కూలిపోబోతోంది అని అంచనా వేసినప్పటికీ… అయితే అది ఎక్కడ పడుతుందా అని వారం నుంచి శాస్త్రవేత్తలు, చైనా ప్రభుత్వం, ప్రపంచ జనాభా కూడా చాలా కంగారు పడ్డారు. ఈరోజు ఉదయమే అది ఇండియాకి దిగువన ఉన్న హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పక్క చాలా దూరంలో హిందూ మహా సముద్రంలో కూలింది.

China Rocket: Latest Update about China Rocket
China Rocket: Latest Update about China Rocket

భారీ రాకెట్.. భూమిపై పడితే అంతే…!!

ఇది భారీ రాకెట్. సుమారుగా 22.5 మెట్రిక్ టన్నులు బరువు ఉంది. దీనిలో ఉన్న కోర్ మాడ్యూల్ రాకెట్ నుండి బయటకు వస్తే .. భూమిపై, జనాభాపై పడితే ఆ ప్రమాదం ఊహించడం కూడా కష్టమే. నిజానికి రాకెట్ పైకి వెళ్ళాక.., కోర్ మాడ్యూల్ బయటకు వచ్చాక ఆ రాకెట్‌ను సురక్షితంగా సముద్రంలో కూల్చేయాల్సి ఉంది. ఈ దశలో చైనా పరిశోధకులు దాన్ని నియంత్రించలేకపోయారు. అది గతి తప్పింది. వేరే మార్గంలోకి వెళ్ళింది. వారం రోజుల నుండి భూమి చోటు తిరుగుతూ ఎక్కడ పడుతుందా అనే కంగారు పెట్టింది. మొత్తానికి ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఇది సముద్రంలో పడిపోయింది.


Share

Related posts

అరటి పండు తగిలింది.. ఆస్పత్రిలో చేరింది!

Teja

RRR movie heroine : రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది , దేవకన్య లా ఉంది గురూ !

bharani jella

అఖిల్ కి షాక్ ఇచ్చిన మోనాల్…. నా అసలు లవర్ అతనే అని ఫ్ల్యాష్ బ్యాక్ బయటపెట్టిన గుజరాతీ బ్యూటీ

arun kanna