మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా మోషన్ పోస్టర్ ను ఈరోజు మెగాస్టార్ 66వ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ తో ముందు నుండి ప్రచారంలో ఉన్న ‘ఆచార్య’ పేరును ఈ సినిమాకు ఫైనలైజ్ చేశారు. ఇక మోషన్ పోస్టర్ ద్వారా చిరంజీవి ‘ధర్మస్థలి’ అనే ఒక ఊరు కోసం పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై అభిమానులకు స్థాయిలో అంచనాలు ఉన్నాయి
ఇక ఈ సినిమా మోషన్ పోస్టర్ కి మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ హైలైట్ గా నిలిచింది. అయితే చిరు అభిమానులు మాత్రం కొరటాల శివ పై ఇంకా కోపం గానే ఉన్నారు. అదేమిటంటే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది అన్న వార్తలు వచ్చిన తర్వాత కూడా దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పైపెచ్చు మోషన్ పోస్టర్ లో కూడా ఎటువంటి హింట్ ఇవ్వలేదు.
అలాగే చిరు ముఖం పూర్తిగా చూపించి ఉంటే బాగుండేదని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక స్టొరీ కి సంబంధించిన డీటైల్స్ పెద్దగా కూడా లేకపోవడం వారిని కొద్దిగా నిరుత్సాహపరిచింది. బాస్ పుట్టినరోజు పూర్తిస్థాయిలో జరుపుకునేందుకు ఇవి కనుక చేసి ఉంటే ఎంతో బాగుండేది అన్నది వారి అభిప్రాయం. వచ్చే సంవత్సరం వేసవికాలంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు చారిత్రాత్మక నేపథ్యం ఉందని కూడా మోషన్ పోస్టర్ చూస్తుంటే మనకు తెలుస్తోంది.