Chiranjeevi: ఆ హీరో కోసం చిరంజీవితో నటించే అవకాశం వదిలేసిన నాటి స్టార్ హీరోయిన్..! తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ అంశాలు..!

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తో నటించాలని ప్రతి హీరోయిన్ ఆశపడుతుంది.. చిరంజీవి సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన చిన్న క్యారెక్టర్ అయినా చేయడానికి ఇష్టపడతారు.. అయితే ఒక్కోసారి అనుకున్న హీరోతో చేయకుండా వేరే హీరోలతో చేయవలసి ఉంటుంది.. అలా చాలా మంది హీరో హీరోయిన్లు కలిసి నటించాల్సిన కాంబినేషన్ ఇప్పటివరకు వర్కవుట్ అవ్వలేదు.. తాజాగా సీనియర్ హీరోయిన్ గౌతమి ఇలాంటి విషయం గురించి మాట్లాడారు..

Chiranjeevi: gouthami combination movie not come because
Chiranjeevi: gouthami combination movie not come because

Read More: Husband wife relation: భార్యతో ఆ టైంలో కూడా మాస్కు తీయని భర్త.. భార్య ఏం చేసిందో తెలుసా..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గౌతమి తెలుగు, తమిళంలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.. ఇటీవల మనమంతా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆలీతో సరదాగా షోకి గౌతమి వచ్చారు. ఆలి సుమారు అందరు స్టార్ హీరోలతో నటించిన మీరు చిరంజీవితో ఎందుకు ఒక్క సినిమా కూడా చేయలేదని గౌతమిని ప్రశ్నించారు. చిరంజీవి గారితో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

అయితే నేనే మిస్ చేసుకున్నాను. అందులో ఒక సినిమా స్టేట్ రౌడీ కూడా ఉంది. కోఇన్సిడెన్స్ ఏంటంటే చిరంజీవిగారి సినిమా డేట్స్ అడిగిన ప్రతిసారి రజినీకాంత్ గారి సినిమా డేట్స్ తో క్లాష్ అయ్యేవి. లేదంటే రజనీకాంత్ సినిమా అండర్ ప్రొడక్షన్ వర్క్ లో ఉండేవి. అందుకే చిరంజీవిగారితో ఇంతవరకు నేను ఏ సినిమా చేయలేకపోయాను. ఈసారి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని తెలిపారు. అంతే కాదు నందమూరి బాలకృష్ణ నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చినా కూడా ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నటించ లేక పోయాను అని చెప్పారు గౌతమి. ఈసారి నటించే అవకాశం వస్తే మిస్ చేసుకోను అని చెప్పారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : ఈ వారం వీరిద్దరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే….

arun kanna

‘విశాఖ పరిణామాలపై అఫిడవిట్ దాఖలు చేయండి’

somaraju sharma

బ్రేకింగ్ : హుటాహుటిన .. గుంటూరు బయలుదేరిన చంద్రబాబు ..??

sekhar